News August 21, 2025

KTRను సొంత చెల్లే వ్యతిరేకిస్తోంది: సీతక్క

image

TG: ‘థర్డ్ క్లాస్ పార్టీ’ అన్న <<17464123>>KTR<<>> కామెంట్స్‌పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ‘KTR ఇంట్లో పంచాయితీ తట్టుకోలేక డైవర్ట్ చేయడానికి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. సొంత చెల్లే వ్యతిరేకించడంతో మైండ్ కరాబైంది’ అని ఎద్దేవా చేశారు. ‘BRS బండారం SEP 9న బయట పడుతుంది. BJPతో దోస్తీ ఉందో లేదో తేలిపోతుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగుబిడ్డకు మద్దతుగా నిలబడతావా, లేదా?’ అని KTRని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.

Similar News

News March 23, 2026

పేరెంట్స్‌ను పట్టించుకోకపోతే జీతంలో రూ.10వేలు కట్!

image

TG: కన్నవారిని పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం షాకివ్వనుంది. వారి జీతంలో 15% లేదా ₹10K కట్ చేసి నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ యాక్ట్‌ను తీసుకురానుంది. ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుపై చర్చించి ఆమోదించనుంది. ఒకట్రెండు రోజుల్లో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేయనుంది.

News March 23, 2026

రాష్ట్రంలో 11వేలకుపైగా హెక్టార్లలో పంట నష్టం

image

AP: అకాల వర్షాలు, వడగళ్లతో రాష్ట్రంలోని 11,337 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 15 జిల్లాల్లోని 9,950 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 9 జిల్లాల్లోని 1,387 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. వరి 2,650 హెక్టార్లు, మొక్కజొన్న 6,450 హెక్టార్లు, మినుముకు 485 హెక్టార్లలో నష్టం వాటిల్లింది. మరోవైపు యుద్ధంతో ఎగుమతులు తగ్గి రాయలసీమలో కమలాపండు పంట ధర టన్ను ₹10వేలు తగ్గి ₹22వేలకు చేరింది.

News March 23, 2026

డర్టీ బాంబ్.. ఇరాన్ ఆఖరి అస్త్రం ఇదేనా?

image

సాధారణ పేలుడు పదార్థాలకు రేడియోధార్మిక వ్యర్థాలను కలిపి చేసేదే ‘డర్టీ బాంబ్’. ఇది అణుబాంబులా భారీ విస్ఫోటం సృష్టించకపోయినా రేడియేషన్‌ను గాలిలో వ్యాపింపజేసి ప్రాంతాన్ని విషపూరితం చేస్తుంది. ఇరాన్ వద్ద 60% శుద్ధి చేసిన యురేనియం తగినంత ఉండటంతో దీని తయారీ సాధ్యమేనని నిపుణులు భావిస్తున్నారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి ఇరాన్‌ ఈ డర్టీ బాంబును ఆఖరి అస్త్రంగా వాడే ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.