News August 21, 2025
అభివృద్ధి దిశగా ముందుకు సాగాలి: కలెక్టర్

ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి గ్రామాల అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు చేపట్టిన పనుల జాతర-2025కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులు ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయంలో ఆగస్టు 22న నిర్వహించనున్న పనుల జాతర కార్యక్రమంపై ఎంపీడీవోలు, ఎంపీవోలు, డీపీవో, పీఆర్ ఇంజినీర్లు, ఏపీవోలతో గురువారం వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Similar News
News March 15, 2026
అభిషేక్, నేను అగ్ని లాంటోళ్లం: సంజు శాంసన్

అభిషేక్ శర్మ, తాను ఐస్-ఫైర్‌లా ఉండమని, తాము కలిస్తే అగ్నికి అగ్ని తోడైనట్లేనని సంజూ శాంసన్ అన్నారు. ‘ఓపెనింగ్‌లో కొన్నిసార్లు నేను, ఇంకొన్నిసార్లు అభిషేక్ దూకుడుగా ఆడాం. 2024 నుంచి ఇదే చేస్తున్నాం’ అని ఇండియా టుడే కాంక్లేవ్‌లో చెప్పారు. ఇంతకుముందు అభిషేక్ ఫాలోయింగ్‌ను చూసి అసూయపడేవాళ్లమని పేర్కొన్నారు. జట్టులో అతడో సూపర్ స్టార్ అని, త్వరగా పెళ్లి చేసుకోవాలని జోక్ చేశారు.
News March 15, 2026
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్!

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు మరిన్ని సౌకర్యాలను TTD అందుబాటులోకి తీసుకొస్తోంది. వసతి గృహాల్లో దిండు, దుప్పటి, చాప, బెడ్‌షీట్‌లను ఇవ్వనుంది. తొలుత నందకంలో ఇవ్వడం ప్రారంభించగా భక్తుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. దీంతో వకుళామాత, పాంచజన్యం, కౌస్తుభం తదితర గెస్ట్‌హౌసుల్లోనూ అందజేయాలని నిర్ణయించింది. దుప్పటి-₹10, 2 దిండ్లు-₹10, చాప-₹10, బెడ్‌షీట్-₹20 చొప్పున చెల్లించి తీసుకోవచ్చు.