News August 21, 2025
నలుగురికి పదేళ్ల జైలు శిక్ష: అనకాపల్లి SP

గంజాయి రవాణాలో నిందితులైన నలుగురికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ చోడవరం జిల్లా కోర్టు జడ్జి హరిహర నారాయణ గురువారం తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. 2015 మార్చి 12న 120 కిలోల గంజాయి రవాణా చేస్తూ జె.రమణ, డీ.మాణిక్యం, జె.నూకరాజు, కె.భూలోక పట్టుబడినట్లు చెప్పారు. వీరిపై ఛార్జ్ షీట్ దాఖలు చేయగా నేరం రుజువు కావడంతో శిక్ష పడిందని వెల్లడించారు.
Similar News
News August 21, 2025
మంటపాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో అనుమతులు: SP

వినాయక మంటపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిగా పొందాలని ఎస్పీ రత్న పిలుపునిచ్చారు. పుట్టపర్తిలో ఆమె మాట్లాడుతూ.. దీని కోసం http://ganeshutsav.net/లో దరఖాస్తులు పొందాలన్నారు. అనంతరం పోలీస్ అధికారులు మండపం ప్రాంతాన్ని పరిశీలించి క్యూఆర్ కోడ్ తో కూడిన NOC జారీ చేస్తారని తెలిపారు.
News August 21, 2025
ఎన్టీఆర్ జిల్లా టుడే టాప్ న్యూస్

☞ మైలవరంలో తల్లిని హత్య చేసిన కొడుకు.
☞ విస్సన్నపేటలో కుక్కల దాడిలో వ్యక్తికి గాయాలు.
☞ విజయవాడ గోల్డ్ చోరీ కేసులో పనిమనిషి అరెస్ట్.
☞ తిరువూరులో 456 పెన్షన్లు తొలగింపు: నల్లగట్ల.
☞ అంతర్రాష్ట్ర బస్సులకు “స్త్రీశక్తి” పథకం వర్తింపచేయాలి: సీపీఎం.
☞ జి.కొండూరులో మహిళా స్వీపర్ మిస్సింగ్.
☞ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి.
News August 21, 2025
మచిలీపట్నం: ఎస్పీని కలిసిన డీఎస్పీ

కృష్ణా జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ నూతన DSP కె.ధర్మేంద్ర గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావును మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ, శక్తి టీమ్స్ పనితీరును పర్యవేక్షించాలని ఎస్పీ సూచించారు. ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్ నివారణతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని DSPకి వివరించారు.