News August 21, 2025
‘గో బ్యాక్ మార్వాడీ’.. రేపు మక్తల్ బంద్..!

‘గో బ్యాక్ మార్వాడీ’ ఉద్యమం ఉద్ధృతమవుతోంది. నారాయణపేట జిల్లా మక్తల్‌లో వర్తక వ్యాపారుల సంఘం రేపు పట్టణ బంద్‌కు పిలుపునిచ్చింది. స్థానికేతరులు వ్యాపారాలను అన్ని ప్రాంతాలకు విస్తరిస్తూ ఇక్కడి వ్యాపార సముదాయాల అద్దెను అమాంతం పెంచి స్థానికులకు ఇబ్బంది కలిగిస్తున్నారని సంఘం అధ్యక్షుడు వెంకటరెడ్డి తెలిపారు.మన ముందు తరాలకు నష్టం జరగకుడదనే ఉద్దేశంతో బంద్ చేపడుతున్నామన్నారు.
Similar News
News March 16, 2026
OTD: సచిన్ శతకాల ‘సెంచరీ’ చేసిన వేళ!

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించి నేటికి 14 ఏళ్లు. 2012 మార్చి 16న సెంచరీ చేసి అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాలు కొట్టిన తొలి, ఏకైక బ్యాటర్‌గా నిలిచారు. ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై 114 పరుగులతో ఈ ఘనత అందుకున్నారు. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కుచెదరకపోవడం గమనార్హం. ప్రస్తుత యాక్టివ్ ప్లేయర్లలో కోహ్లీ(85) ఒక్కరే ఆ మైలురాయికి దగ్గర్లో ఉన్నారు.
News March 16, 2026
నేటి ‘రైతన్నా మీకోసం వారోత్సవాలు’: కడప కలెక్టర్

సోమవారం నుంచి 25వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ‘రైతన్నా మీకోసం వారోత్సవాలు’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, రైతుల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ఖరీఫ్ సాగు పద్ధతులపై అవగాహన, పంటల ప్రణాళిక, ఆధునిక సాంకేతికతపై అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు.
News March 16, 2026
9/11 తరహా ఉగ్రదాడికి కుట్ర.. ఇరాన్ సంచలన ఆరోపణలు!

ఉగ్రదాడికి ఎప్‌స్టీన్ నెట్‌వర్క్ కుట్ర పన్నిందని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని సంచలన ఆరోపణలు చేశారు. ‘ఎప్‌స్టీన్ నెట్‌వర్క్‌లో మిగిలిన సభ్యులు USలో 9/11 తరహా ఘటనను క్రియేట్ చేసి, దానికి ఇరాన్‌ను నిందించాలని ప్లాన్ చేసినట్లు విన్నాను. మేం ఇలాంటి వాటికి వ్యతిరేకం. మా యుద్ధం US ప్రజలతో కాదు’ అని ట్వీట్ చేశారు. 2001 SEP 11న న్యూయార్క్ ట్విన్ టవర్స్‌పై అల్ ఖైదా చేసిన దాడిలో 3వేల మంది చనిపోయారు.


