News August 21, 2025

HYD: ఇద్దరు మావోయిస్టు అగ్ర నాయకులు లొంగుబాటు

image

తెలంగాణలో ఇద్దరు మావోయిస్టు నాయకులు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఎదుట గురువారం లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో రాష్ట్ర కమిటీ మెంబర్ కాకరాల సునీత అలియాస్ బద్రి, చెన్నూరు హరీశ్ ఉన్నట్లు CP తెలిపారు. కాకరాల సునీత అలియాస్ బద్రిపై రూ. కోటి రివార్డు ఉంది. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందజేస్తామని CP సుధీర్ బాబు స్పష్టం చేశారు.

Similar News

News March 15, 2026

ఏలూరు: జలాశయంలో ఇద్దరి గల్లంతు

image

బుట్టాయగూడెం మండలం దొరమామిడి జలాశయంలో ఆదివారం ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన తుమ్మల నాగరాజు (30), తుమ్మల రమణ (35) గుబ్బల మంగమ్మ గుడికి వెళ్లారు. అనంతరం వారు జలాశయం వద్దకు వచ్చారు. స్నానం చేస్తుండగా వారు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

News March 15, 2026

కమ్యూనిస్ట్ గడ్డపై కమలం వికసిస్తుందా?

image

సౌత్ ఇండియాపై కన్నేసిన BJP కమ్యూనిస్ట్ గడ్డ కేరళంపై జెండా ఎగురవేయాలని చూస్తోంది. పినరయి విజయన్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, శబరిమల గోల్డ్ చోరీ కేసును అవకాశంగా మలుచుకుంటోంది. అటు కేరళంలో BJPని అడుగుపెట్టనివ్వబోమని విజయన్ అంటున్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. <<19389988>>మే 4న<<>> వెలువడే ఫలితాలు కేరళం రాజకీయ భవిష్యత్తును తేల్చనున్నాయి..

News March 15, 2026

జనగణన నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

జనగణన-2027 మార్గదర్శకాల ప్రకారం ఇండ్ల జాబితా, గణన ప్రక్రియను జిల్లాలో నిర్దేశిత సమయంలోనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. మూడు రోజుల పాటు జిల్లా, మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు నిర్వహించిన శిక్షణ ఆదివారం కలెక్టరేట్‌లో ముగిసింది. హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ జాయింట్ డైరెక్టర్ డి. సుబ్బరాజు, గణాంకాధికారి సతీష్ పాల్గొని శిక్షణ ఇచ్చారు.