News August 21, 2025

ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

image

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు మంత్రి క్యాంప్ కార్యాలయం అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి మండలంలో మంత్రి పర్యటిస్తారని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటలకు కూసుమంచి మండలం జీళ్లచెరువులో వెంకటేశ్వర స్వామి గుడికి, అంతర్గత సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు.

Similar News

News August 21, 2025

ఖమ్మం: 30 రోజుల కస్టడీ బిల్లు.. ప్రతిపక్షాలపై కుట్ర: సీపీఐ

image

ప్రజలందరికీ దేశానికి ఉపయోగపడే చట్టాలు చేయాల్సిన పార్లమెంట్, చట్టపరమైన విధానాలను తప్పించుకునే దిశగా బిల్లులు తీసుకొస్తోందని CPI(M) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం ఖమ్మంలో జరిగిన దొంగల కోటయ్య సంస్కరణ సభలో తమ్మినేని పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్షాలను అణచివేసే చర్యల్లో భాగమే 130 రోజుల కస్టడీ బిల్లు అని తమ్మినేని పేర్కొన్నారు.

News August 21, 2025

ఖమ్మం: కేంద్ర ఆర్థిక మంత్రికి కలిసిన: డిప్యూటీ సీఎం

image

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్లమెంట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఆర్థిక, అభివృద్ధి అంశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. ఈ భేటీలో ఎంపీలు పొరిక బలరాం నాయక్, రామసహాయం రఘురాం రెడ్డి, డాక్టర్ మల్లు రవి కూడా పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, పథకాలు, ఆర్థిక సహాయంపై డిప్యూటీ సీఎం వివరించారు.

News August 21, 2025

నీటిపారుదల సంరక్షణ చర్యలు చేపట్టాలి: ఖమ్మం ఎంపీ

image

ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి గురువారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్రమంత్రికి పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద అన్ని జిల్లాలకు ప్రాజెక్టులు మంజూరు చేయాలని కోరారు. నీటిపారుదల, సంరక్షణ చర్యలు చేపట్టాలని, స్థిరమైన గ్రామీణాభివృద్ధికి సహకారం అందించాలన్నారు.