News August 21, 2025

NLG: దెబ్బతిన్న రోడ్లపై మంత్రి సమీక్ష

image

హ్యామ్ రోడ్లు, నేషనల్ హైవేలకు సంబంధించిన అంశాలతోపాటు, ఇటీవల వరదల కారణంగా దెబ్బతిన్న ఆర్ అండ్ బీ రోడ్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో కోమటిరెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఈఎన్‌సీ జయభారతి, సీఈ రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News August 22, 2025

సూర్యాపేట: ‘పహాణీలో పేరు మార్పుపై కేసు నమోదు’

image

గరిడేపల్లి మండలంలో పహాణీలో పట్టాదారు పేరు మార్చిన ఘటనపై సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై ఇది వరకే చర్యలు తీసుకోవాలని ఆదేశించడమే కాక, తప్పు చేసిన వారిపై పోలీస్ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు. తహశీల్దార్ కార్యాలయంలో ఎవరి ప్రమేయంతో ఈ తప్పు జరిగిందో విచారణ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు.

News August 22, 2025

ప్ర‌కృతికి న‌చ్చేలా.. గ‌ణ‌ప‌తి మెచ్చేలా.. మట్టి విగ్రహాల తయారీ: కలెక్టర్

image

ఈసారి మట్టి గణపతి విగ్రహాల తయారీతో ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఈ విషయాన్ని వివరించారు. పర్యావరణ హిత మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈనెల 26న ఒకే నగరంలో అత్యధిక సంఖ్యలో మట్టి విగ్రహాలను తయారు చేసి ఈ రికార్డును నెలకొల్పనున్నట్లు కలెక్టర్ వివరించారు.

News August 22, 2025

నల్గొండలో దిల్ ధార్ ఆటో డ్రైవర్

image

నల్గొండ పట్టణంలో నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్ బకరం నరసింహను పోలీసులు ఈరోజు అభినందించారు. తన ఆటోలో ప్రయాణికురాలు జార విడుచుకున్న ఖరీదైన సెల్‌ఫోన్‌ను గుర్తించి, వెంటనే టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్ఐ సైదులుకు అప్పగించారు. విచారణ అనంతరం ఎస్ఐ ఆ ఫోన్‌ను, బాధితురాలు అరుణకు అందజేశారు. డ్రైవర్ నరసింహ నిజాయతీని మెచ్చుకున్న ఎస్ఐ, సిబ్బంది ఫారూక్‌తో కలిసి ఆయనను సత్కరించారు.