News August 21, 2025
అడ్డతీగల: ఇక్కడ విద్యార్థె టీచర్..?

అడ్డతీగల మండలం కొచ్చావారివీధి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు 10 రోజులుగా టీచర్ రావడం లేదని గ్రామస్థులు తెలిపారు. ఇక్కడ పని చేసే ఒక్క టీచర్‌ను అడ్డతీగల డిప్యూటేషన్ పై వెళ్లడంతో పాఠాలు బోధించే వారు లేరని అంటున్నారు. 11 మంది విద్యార్థులు ఉన్నారని ప్రతీరోజు పాఠశాలకు వచ్చి పోతున్నారని తెలిపారు. తోటి విద్యార్థి కాసేపు పాఠాలు చెబుతున్నాడన్నారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News August 22, 2025
పవన్ కళ్యాణ్ సూచన.. CBN అభినందనలు

AP: ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. నాలా చట్టసవరణపై చర్చిస్తుండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచన చేశారు. సాగుభూమిని వ్యవసాయేతరంగా మార్చేటప్పుడు లభించే ఆదాయం పంచాయతీలకు అందేలా చూడాలని, తద్వారా పంచాయతీలు బలోపేతం అవుతాయని చెప్పారు. దీనిపై స్పందించిన చంద్రబాబు మంచి సూచన చేశారని పవన్‌ను అభినందించారు. పవన్ సూచనలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News August 22, 2025
వేములవాడలో మహా లింగార్చన పూజ

మాస శివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం మహా లింగార్చన పూజ ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు జ్యోతులను లింగాకారంలో వెలిగించి, ప్రత్యేక పుష్పాలతో స్వామివారిని అలంకరించారు. మాస శివరాత్రి రోజున మహా లింగార్చన పూజను దర్శించుకుంటే సకల దోషాలు తొలగి పుణ్యఫలాలు లభిస్తాయని అర్చకులు తెలిపారు. ఈ పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
News August 22, 2025
జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం

జగిత్యాల జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మినీ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ జూనియర్ ఎంపిక పోటీలను డాక్టర్ మోర సుమన్ కుమార్ గురువారం ప్రారంభించారు. వివిధ పోటీలలో సత్తా చాటిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ముత్తయ్య రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అంజయ్య, కొమురయ్య, కార్తీక్, ప్రశాంత్, శంకర్ తదితరులు ఉన్నారు.