News August 21, 2025

వారికి రూ.15 లక్షల సాయం

image

ఉద్యోగి చనిపోతే కుటుంబానికి ఇచ్చే డెత్ రిలీఫ్ ఫండ్‌ను EPFO భారీగా పెంచింది. గతంలో గరిష్ఠంగా ₹8.8 లక్షలుగా ఉన్న ఈ సాయాన్ని తాజాగా ₹15 లక్షలకు చేర్చింది. 2025 APR 1 తర్వాత ఎవరైనా ఉద్యోగి చనిపోతే అతని కుటుంబానికి ఈ మొత్తం అందుతుంది. 2026 APR 1 నుంచి ఈ ఎక్స్‌గ్రేషియా ఏటా 5% పెరుగుతుందని EPFO వెల్లడించింది. అటు మైనర్లకు అందాల్సిన డబ్బును గార్డియన్ షిప్ సర్టిఫికెట్ లేకుండానే ఇకపై ఇవ్వనున్నారు.

Similar News

News March 16, 2026

ఏపీలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం

image

AP: ఎండలు ముదురుతుండటంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ఏప్రిల్-మేలో గరిష్ఠ డిమాండ్ 280MUలుగా అంచనా వేయగా ఈ నెలలోనే 274MUలకు చేరింది. ఇందుకు తగ్గట్లుగానే ఏపీ జెన్‌కో <<19368040>>భారీగా<<>> విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. విజయవాడ VTPS, కడప RTPP, కృష్ణపట్నంలో దాదాపు 10 లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. కాబట్టి కరెంట్ ఉత్పత్తికి ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు <<19384107>>చెబుతున్నారు<<>>.

News March 16, 2026

ఆస్కార్ అవార్డులు.. ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ హవా

image

*ఉత్తమ సహాయ నటుడు- షాన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
*కాస్టింగ్ – కస్సాండ్రా (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
*రైటింగ్ (అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే)- పౌల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
*రైటింగ్ (ఒరిజినల్ స్క్రీన్‌ప్లే)- ర్యాన్ కూగ్లర్ (సిన్నర్స్)
*లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్(2 చిత్రాలకు)- ది సింగర్స్, టూ పీపుల్ ఎక్స్‌ఛేంజింగ్ సలైవా

News March 16, 2026

స్కూళ్లు, అంగన్‌వాడీలు నేటి నుంచి ఒంటిపూటే

image

AP, TGలో ఇవాళ్టి నుంచి స్కూల్ విద్యార్థులకు ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. APలో ఉ.7.45 గంటలకు, TGలో ఉ.8 గంటలకు ప్రారంభమై మ.12.30 గంటలకు ముగుస్తాయి. ఇక అంగన్‌వాడీలనూ నేటి నుంచే ఒంటిపూట నిర్వహించాలని AP శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. పాఠశాలల మాదిరే ఏప్రిల్ 23 వరకు ఇవి కొనసాగనున్నాయి. ఉ.8 గంటల నుంచి మ.12.30 గంటల వరకు కేంద్రాలు తెరిచి ఉంటాయని, చిన్నారుల పేరెంట్స్ గమనించాలని సూచించింది.