News August 21, 2025
GWL: లీగల్ ఎయిడ్ సేవలు వినియోగించుకోవాలి

వయోవృద్ధులు లీగల్ ఎయిడ్ సేవలు వినియోగించుకోవాలని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజేందర్ పేర్కొన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినాన్ని పురస్కరించుకొని గద్వాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యాలయంలో వయోవృద్ధులకు న్యాయ సలహాలు గురించి అవగాహన కల్పించారు. వయోవృద్ధుల చట్టాలు, చట్టపరమైన ఇబ్బందులు, పెన్షన్, తదితర సమస్యల పరిష్కారం గురించి వివరించారు.
Similar News
News March 18, 2026
ADB: గ్రామాలను గంజాయి రహితంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

సర్పంచులు, కౌన్సిలర్లు తమ పరిధిలోని గ్రామాలను, వార్డులను గంజాయి రహితంగా మార్చాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు ‘మూడవ కన్ను’లా పనిచేస్తాయని, ప్రతి ఒక్కరూ వీటి ఏర్పాటుపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమాజ శ్రేయస్సు కోసం అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
News March 18, 2026
ఎక్సైజ్ ఉద్యోగుల క్రీడల ముగింపు

ఉద్యోగుల్లో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. బుధవారం కొమ్మాది స్పోర్ట్స్ మైదానంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఎక్సైజ్ ఉద్యోగుల క్రీడల ముగింపును నిర్వహించగా ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరామచంద్రమూర్తి, అసిస్టెంట్ కమిషనర్ మహేశ్ కుమార్ తదితరలు పాల్గొన్నారు.
News March 18, 2026
ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు

AP: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఇవాళ్టితో ముగిశాయి. చివరి రోజున కెమిస్ట్రీ పరీక్షకు 3.87 లక్షల మంది హాజరయ్యారు. ఈనెల 21 నుంచి వాల్యుయేషన్ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ పి.రంజిత్ బాషా తెలిపారు. వాల్యుయేషన్ పారదర్శకంగా, తప్పులు దొర్లకుండా చేయాలని అధ్యాపకులకు సూచించారు.


