News August 21, 2025
GWL: గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ అధికారులు పర్యవేక్షణ చేయాలని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. గత నెలలో జిల్లాలో పోలీస్ స్టేషన్ల వారిగా నమోదైన కేసుల వివరాలు ఆ కేసుల్లో అధికారులు సాధించిన పురోగతిని పరిశీలించారు. గణేష్ ఉత్సవాల్లో శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
Similar News
News March 18, 2026
పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు ఉగాది కానుక

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గంలో చాలా గ్రామాలు ముంపుకు గురవుతున్న విషయం తెలిసిందే. నిర్వాసితులకు బుధవారం ఉగాది కానుకగా 3వ విడత ఆర్ అండ్ ఆర్ నష్టపరిహారం రూ. 250 కోట్ల చెక్కును అమరావతిలో సీఎం చంద్రబాబు అందించారు. పోలవరం జిల్లాలోని చింతూరు డివిజన్‌లో నిర్వాసితులను ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి అమరావతి తీసుకువెళ్లి వారికి సీఎం చేతుల మీదుగా చెక్కులు అందజేశారు.
News March 18, 2026
విజయవాడలో వేడుకల కోసం వెండి రథం

ఉగాది పండగ, వసంతోత్సవాల కోసం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో వెండి రథం సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. తెలుగు నూతన సంవత్సరం గురువారం ప్రారంభం కానున్నట్లు అర్చకులు తెలిపారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. వెండి రథ ఊరేగింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేపడుతున్నామన్నారు.
News March 18, 2026
దివ్యాంగ చిన్నారులతో విశాఖ కలెక్టర్ ఆత్మీయ విందు

విశాఖలోని వివిధ వసతి గృహాలకు చెందిన దివ్యాంగ చిన్నారులతో కలిసి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆత్మీయ విందు నిర్వహించారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారులతో కలిసి భోజనం చేస్తూ వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు.


