News August 21, 2025
ఆగస్టు 22న పనుల జాతర: KMR కలెక్టర్

జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో ఆగస్టు 22న పనుల జాతర నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. గురువారం ఐసీడీఎస్‌లో సమావేశం నిర్వహించారు. గ్రామసభల ద్వారా అభివృద్ధి పనుల వివరాలు ప్రజలకు వివరించాలన్నారు. ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. ఉపాధి హామీలో అత్యధిక దినాలు పని చేసిన కూలీలు, దివ్యాంగులు, మల్టీపర్పస్ వర్కర్స్‌ను సన్మానించాలని డీఆర్డీఓ సురేందర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News March 13, 2026
హార్ముజ్‌లో నౌకలకు రక్షణ ఇవ్వలేం.. చేతులెత్తేసిన అమెరికా!

హార్ముజ్ జలసంధిని దాటుకొని నౌకలు <<19338961>>ధైర్యంగా వెళ్లాలని<<>> చెప్పిన అమెరికా ఇప్పుడు చేతులెత్తేసింది. ‘హార్ముజ్ నుంచి వెళ్లే నౌకలకు రక్షణ కల్పించలేం. ప్రస్తుతానికి మేం రెడీగా లేము. ఇరాన్‌పై దాడులు చేయడంపైనే మా సైన్యం దృష్టి ఉంది. ఈ నెలాఖరుకు ఎస్కార్ట్ కల్పించే ఛాన్స్ ఉంది’ అని US ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ చెప్పారు. ఇవాళ US షిప్‌పై ఇరాన్ <<19364482>>దాడి చేయడం<<>> తెలిసిందే.
News March 13, 2026
వేములవాడలో కార్పెంటర్ ఆత్మహత్య

చందుర్తి మండలానికి చెందిన రాజూరి వీరాచారి (45) అనే కార్పెంటర్ గురువారం వేములవాడ శివారులోని కోనాయిపల్లెలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన్నేళ్లుగా వేములవాడలో నివాసం ఉంటున్న ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News March 13, 2026
65 లక్షల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు: రేవంత్

TG: వైద్యం యాంత్రికంగా ఉండొద్దని, మానవత్వంతో కూడిన చికిత్స అందించాలని CM రేవంత్ అన్నారు. ప్రైవేట్ రంగంలోని డాక్టర్లు ఏడాదిలో ఒక నెల ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేయాలని చెప్పారు. ‘రాష్ట్రంలో 65L మంది హెల్త్ డేటా తయారు చేస్తున్నాం. వాళ్లకు డిజిటల్ హెల్త్ కార్డులిస్తాం’ అని తెలిపారు. 1.30 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా అందించాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. క్యాన్సర్‌కు చికిత్స పైనా దృష్టి పెట్టామన్నారు.


