News August 21, 2025
మంచిర్యాల: ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనుల పరిశీలన

మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం పరిశీలించారు. రూ.216 కోట్ల నిధులతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ అసిస్టెంట్ ఈఈ అనూష పాల్గొన్నారు.
Similar News
News March 18, 2026
MBNR: ‘తొలిసారిగా డిజిటల్‌లో జనాభా గణన’

జనాభా గణనను దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టల్‌లను ఉపయోగించి గణన ప్రక్రియను నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్‌ను ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. 2021లో నిర్వహించవలసిన ఈ ప్రక్రియ కోవిడ్ కారణంగా ఆలస్యం అయిందన్నారు.
News March 18, 2026
సంగారెడ్డి: 25లోగా ‘రైతు భరోసా’కు దరఖాస్తు చేసుకోండి

రైతు భరోసా పథకానికి అర్హులైన కొత్త రైతులు ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ సూచించారు. ఫిబ్రవరి 28 వరకు కొత్తగా పాస్ పుస్తకాలు పొందినా, గతంలో దరఖాస్తు చేసుకున్న వారు వివరాల్లో మార్పులు, చేర్పులకు అవకాశం ఉందని చెప్పారు. కావున రైతులు రైతు వేదికల్లోని మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News March 18, 2026
నిజాంపేట: తిప్పన్నగుల్లలో కాకతీయ కాలపు శివాలయం గుర్తింపు

నిజాంపేట మండలం తిప్పన్నగుల్లలో కాకతీయ శైలికి చెందిన పురాతన శివాలయాన్ని ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ సభ్యుడు బుర్ర సంతోష్ గుర్తించారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయంలో శివలింగం లేకపోయినా, లతలు, సింహాలు, హంసల చెక్కడాలతో కూడిన మూడు గర్భద్వారాలు అద్భుతంగా ఉన్నాయి. శైవ ద్వారపాలకుల శిల్పాలు ఈ ఆలయ విశిష్టతను చాటుతున్నాయని ఆయన పేర్కొన్నారు.


