News August 21, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం EC కసరత్తు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం EC కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేక సమ్మరీ రివిజన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. కొత్త ఓటర్ల నమోదు, మార్పు చేర్పులకు అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్ 2 నుంచి 17 వరకు అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. 25 లోపు అభ్యంతరాలను పరిష్కరించాలని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30న తుది జాబితా విడుదల కానుంది. జులై 1 నాటికి 18 ఏళ్లు నిండినవారు ఓటురు నమోదు చేసుకోవచ్చు.
SHARE IT
Similar News
News March 11, 2026
త్వరలో కరీంనగర్-జగిత్యాల జాతీయ రహదారి పనులు

కరీంనగర్ – జగిత్యాల మధ్య జాతీయ రహదారి (NH-563)ని నాలుగు వరుసలుగా విస్తరించే పనులను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. శంకుస్థాపన కోసం సమయం కేటాయించాలని కోరగా గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సుమారు రూ. 2,151 కోట్లతో 59 కిలోమీటర్ల మేర ఈ రహదారిని అభివృద్ధి చేయనున్నారు.
News March 11, 2026
చిత్తూరులో 13న ముస్లింలకు ఇఫ్తార్ విందు

రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులకు “ఇఫ్తార్ విందు” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి చిన్నారెడ్డి పేర్కొన్నారు. 13వ తేదీ శుక్రవారం 5:30 గం.లకు చిత్తూరు నగరంలోని అగ్నిమాపక కేంద్రం సమీపంలోని ఉర్దూ షాదీ మహల్‌లో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ విందు ఏర్పాటు చేశారు.
News March 11, 2026
ముమ్మరంగా వాహనాల తనిఖీ

జిల్లా వ్యాప్తంగా బుధవారం పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రధాన కూడళ్లలో SIలు, సిబ్బంది తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించి, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు.


