News August 21, 2025
GWL: ఏటీసీ ప్రవేశాలకు ప్రత్యేక మేళా- నర్సింగరావు

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఏటీసీ కేంద్రాల్లో ప్రవేశాలకు ఈనెల 22న ఐడీఓసీ మందిరంలో ప్రత్యేక మేళా నిర్వహిస్తున్నట్లు గద్వాల అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు పేర్కొన్నారు. గురువారం ఆయన ఛాంబర్‌లో టీ గెట్ సభ్యులు, యూనిసెఫ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కేంద్రాలు గద్వాల, శెట్టి ఆత్మకూరులో ఉన్నాయని తెలిపారు. SSC, ఇంటర్, డిగ్రీ, బి.టెక్, ఎంబీఏ వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News March 15, 2026
దీదీ వర్సెస్ మోదీ.. బెంగాల్‌లో దంగల్

బెంగాల్‌లో APR 23, 29న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో కాషాయాన్ని విస్తరిస్తున్న BJP బెంగాల్‌లోనూ పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది. మోదీ స్వయంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. మరోవైపు TMC చీఫ్ మమతా బెనర్జీ(దీదీ) మరోసారి అధికారాన్ని కాపాడుకునేందుకు కష్టపడుతున్నారు. రాష్ట్రంలో కమలం వికసించకుండా చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో బెంగాల్‌లో దంగల్ ఫైట్ రసవత్తరంగా మారింది.
News March 15, 2026
వనపర్తి: ఎస్సీ కార్పొరేషన్‌లో సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సిరాజుద్దీన్ అహ్మద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17 నుంచి 24 వరకు http://obmms.cgg.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు. వ్యవసాయేతర పథకాలకు 21-50 ఏళ్లు,వ్యవసాయ పథకాలకు 21-60 ఏళ్లు,శిక్షణా పథకాలకు 18-45 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు.
News March 15, 2026
WGL: రికార్డు ధర పలుకుతున్న నిమ్మకాయ

వేసవి కాలంలో చల్లధనం కోసం విపరీతంగా నిమ్మకాయలను వాడుతారు. నిమ్మ మార్కెలో ప్రస్తుతం నిమ్మ బస్తా(23 కిలోల టిక్కి) రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు పలుకుతోందని వ్యాపారులు అంటున్నారు. ఎకరాల్లో నిమ్మ సాగవుతున్నా తెగుళ్ల కారణంగా నిమ్మ దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని, మార్కెట్లో రేటు ఉన్నా చేతిలో సరకు లేక పెట్టుబడి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణాల్లో ఒక నిమ్మకాయ రూ.5 పలుకుతుంది.


