News August 21, 2025

KNR: ‘ఉచిత విద్యుత్ అందించండి’

image

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల కోసం KNRలో ఏర్పాటు చేసే వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్ అందించాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కరీంనగర్ విద్యుత్ శాఖ ఎస్‌ఈకి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్‌లు, నియంత్రికలు, స్తంభాల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని విద్యుత్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Similar News

News August 21, 2025

KNR: ‘బాల భరోసా సర్వే పకడ్బందీగా చేయాలి’

image

కరీంనగర్ జిల్లాలో ఐదేళ్ల లోపు పిల్లల ‘బాల భరోసా’ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సర్వే ద్వారా ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించవచ్చని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే తదితరులు పాల్గొన్నారు.

News August 21, 2025

KNR: ‘హెచ్ఐవి గురించి పూర్తి విధివిధానాలు తెలుసుకోవాలి’

image

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మీటింగ్ హాల్లో అంగన్వాడీ టీచర్లకు హెచ్ఐవిపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో DMHO వెంకట రమణ మాట్లాడుతూ.. అంగన్వాడీ కార్యకర్తలు అందరూ హెచ్ఐవి గురించి పూర్తి విధివిధానాలు తెలుసుకోవాలని అన్నారు. అది వ్యాప్తి చెందే మార్గాలను, నివారణ చర్యలను జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసి హెచ్ఐవి నిరోధించడంలో ప్రధాన భూమిక వహించాలని తెలిపారు.

News August 21, 2025

KNR: MEPMA నూతన ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా స్వరూపరాణి

image

కరీంనగర్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ నూతన ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా స్వరూపరాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) టి.కె.శ్రీదేవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణ పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, స్వయం సహాయక సంఘాల బలోపేతం, జీవనోపాధి అవకాశాల విస్తరణ వంటి కీలక కార్యక్రమాల అమలును ఆమె పర్యవేక్షించనున్నారు.