News August 21, 2025

KNR: ‘ఇప్పటికే సీఎం అన్ని పార్టీలను కోరారు’

image

ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఇప్పటికే CM అన్ని పార్టీలను కోరారని మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం అన్నారు. సుదర్శన్ రెడ్డి తెలుగు బిడ్డ.. ఆయనకు అన్ని పార్టీలు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసారు. న్యాయ కోవిధుడు రాజ్యసభలో కూర్చుంటే రాజ్యాంగం పరిరక్షించబడుతుందని చెప్పారు. తెలంగాణ బిడ్డ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న ఇండియా కూటమి వెంట వస్తారా లేదా అనేది పార్టీల విజ్ఞతకు వదిలేస్తున్నామన్నారు.

Similar News

News March 6, 2026

ఇరాన్ సుప్రీంలీడర్‌ను నేనే ఎంపిక చేస్తా: ట్రంప్

image

ఇరాన్ సుప్రీంలీడర్ ఎన్నిక విషయంలో తాను ఇన్వాల్వ్ అవుతానని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఖమేనీ కొడుకు మొజ్తబా సుప్రీంలీడర్‌ అయ్యే అవకాశం ఉందని, దీన్ని అంగీకరించబోమని స్పష్టంచేశారు. శాంతి, సామరస్యాన్ని తీసుకొచ్చే వ్యక్తిని కోరుకుంటున్నామని తెలిపారు. ‘వాళ్లు టైమ్ వేస్ట్ చేస్తున్నారు. ఖమేనీ కొడుకు ప్రభావం చూపలేడు. వెనిజులాలో డెల్సీని ఎంపిక చేసినట్లే ఇక్కడా నేను నియామకంలో పాల్గొనాలి’ అని చెప్పారు.

News March 6, 2026

పెద్దపల్లి: ‘రెవెన్యూ ఫైల్స్ వెంటనే క్లియర్ చేయాలి’

image

రెవెన్యూ శాఖలో పెండింగ్ ఫైల్స్ వెంటనే క్లియర్ చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మార్చి 6 నుంచి వచ్చే దరఖాస్తులను 15 రోజుల్లో డిస్పోస్ చేయాలన్నారు. సమీకృత కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డి.వేణు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిజిటల్ జనగణన, ఏప్రిల్-మేలో హౌస్ లిస్టింగ్ పూర్తి చేయాలని, ఎస్.ఐ.ఆర్ కార్యక్రమం తెలంగాణ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలతో కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు.

News March 6, 2026

BREAKING: ఫైనల్లోకి భారత్

image

T20WCలో భారత్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఉత్కంఠభరితంగా జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 7 రన్స్ తేడాతో విజయం సాధించింది. 254 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లిష్ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. బెథెల్ సెంచరీతో (48 బంతుల్లో 105) బెంబేలెత్తించినా చివర్లో వికెట్లు పడటంతో భారత్ విజయం సాధించింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనుంది.