News August 21, 2025

బాలుర గురుకుల పాఠశాల, కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

మడికొండ శివారులోని బాలుర గురుకుల పాఠశాల, కళాశాలను కలెక్టర్ స్నేహ శబరీశ్ గురువారం తనిఖీ చేశారు. హాస్టల్‌లోని డైనింగ్ హాల్, ప్రాంగణం, స్టోర్ రూమ్, తరగతి గదులను ఆమె పరిశీలించారు. హాస్టల్ నిర్వహణకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. కిచెన్ రూమ్‌లో కూరగాయలు, పప్పులు, వంట నూనెలు, తదితర నిత్యవసరాలను కలెక్టర్ పరిశీలించారు.

Similar News

News March 14, 2026

బుగ్గారం: ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

image

బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామ ఎస్సీకాలనీ వద్ద గల జాతీయ రహదారిపై జగిత్యాల నుండి ధర్మపురి వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికీ ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన ఇంటి పరిసర ప్రాంతాలలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

News March 13, 2026

యుద్ధం.. ఐదుగురు భారతీయులు మృతి

image

ఒమన్‌లోని సోహార్ పారిశ్రామిక ప్రాంతంలో కూల్చివేసిన డ్రోన్ శకలాలు పడటంతో ఇద్దరు భారతీయులు మృతిచెందినట్లు విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈ ఘటనలో మరో 10 మంది భారతీయులు గాయపడ్డారు. మరోవైపు హార్ముజ్‌లో చిక్కుకుపోయిన నౌకల్లో ఉన్న భారత నావికుల్లో ముగ్గురు చనిపోయినట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఐదుగురు ఇండియన్స్ ప్రాణాలు విడిచినట్లు అయ్యింది.

News March 13, 2026

టీచర్ ప్రతిరోజు భోజనం నాణ్యత చెక్ చేయాలి: మంత్రి లోకేశ్

image

AP: మైలవరంలో విద్యార్థులకు నాసిరకం భోజనం <<19370398>>పెట్టడంపై<<>> విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిరోజూ ఒక టీచర్ భోజనం నాణ్యత పరిశీలించాలని ఆదేశించారు. MLAలు వారానికి ఒక స్కూలును సందర్శించాలని విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని సూచించారు. డొక్కా సీతమ్మ పేరుపై నడుస్తున్న భోజన ప‌థ‌కంపై కుట్ర‌లు చేసినా, నాణ్య‌త త‌గ్గినా క‌ఠిన‌ చ‌ర్య‌లు తప్పవని హెచ్చరించారు.