News August 21, 2025

గణేశ్ మండపాల ఏర్పాటుకు ఎస్పీ సూచనలు ఇవే..

image

గణేశ్ మండపాల ఏర్పాటుకు విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం పలు సూచనలు చేశారు.
➣ఎటువంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదు
➣సింగిల్ విండో విధానంతో https://ganeshutsav.net లింక్ ద్వారా అనుమతులు
➣విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు వివరాలు తప్పనిసరి
➣కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు, అనుపు తేదీ ముందే చెప్పాలి
➣NOC పొందిన తరువాత ప్రింట్ తీసుకొని మండపంలో భద్రపరచాలి

Similar News

News March 20, 2026

గ్యాస్ పొదుపుగా వాడుకోవాలి: VZM కలెక్టర్

image

జిల్లాలో గృహ వినియోగ గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని, డిమాండ్‌కు సరిపడా సరఫరా జరుగుతోందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు శుక్రవారం నిర్వహించిన VC అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. అవసరానికి మించి గ్యాస్ బుకింగ్ చేయకుండా, పొదుపుగా వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. డిమాండ్-సప్లై అంతరాన్ని తగ్గించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను అదేశించారు.

News March 20, 2026

గోదావరిలో విజయనగరం విద్యార్థి గల్లంతు

image

ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద గోదావరి నదిలో <<19432323>>గల్లంతైన<<>> ఐదుగురు యువకులు అమరావతిలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. సతీశ్(మదనపల్లి), నవదీప్ (ఉయ్యూరు), తేజజ్ఞ(ఉయ్యూరు), శ్రీకర్(భద్రాచలం), అభిరామ్(విజయనగరం) అని తేల్చారు. వీరంతా బీటెక్ సెకండియర్ చదువుకుంటున్నారన్నారు. ఏడుగురు గోదావరిలో దిగగా ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారన్నారు.

News March 20, 2026

విజయనగరంలో ఈనెల 24న మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు

image

విజ్జి స్టేడియంలో ఈనెల 24న ఉదయం 8 గంటలకు మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వర రావు శుక్రవారం తెలిపారు. 35 ఏళ్లు, 45 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నామన్నారు. ఆసక్తి గలవారు SAAP వెబ్‌సైట్‌లో ఆధార్‌తో రిజిస్టర్ కావాలని, అవసరమైన పత్రాలు సమర్పించాలని సూచించారు.