News August 21, 2025
జగిత్యాల: ‘NCC ద్వారా విద్యార్థులకు దేశభక్తి పెరుగుతుంది’

NCC ద్వారా విద్యార్థులకు దేశభక్తి అలవడుతుందని ఆర్మీ హవల్దార్లు రాకేష్, పి.వి.రావు అన్నారు. గురువారం SKNR ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు శారీరక, భౌతిక సామర్థ్య పరీక్షలు నిర్వహించి పలువురు విద్యార్థులను NCCకి ఎంపిక చేశారు. ప్రిన్సిపల్ అరిగెల అశోక్ మాట్లాడుతూ.. NCC సర్టిఫికెట్ ద్వారా త్రివిధ దళాల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని అన్నారు.
Similar News
News March 21, 2026
కరీంనగర్: SI చంద్రశేఖర్ చివరి కోరిక ఇదే..!

కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్, అతడి <<19441898>>భార్య దివ్య మృతిని తట్టుకోలేక<<>> ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమెను దహనం చేసిన పక్కనే తనను కూడా దహనం చేయాలని ముందురోజే చెప్పాడని దివ్య తండ్రి సమ్మయ్య తెలిపారు. ఇల్లందకుంట మండలం సీతంపేటలోని అత్తారింట్లో ఈరోజు చంద్రశేఖర్ ఆత్మహత్యకి పాల్పడ్డాడు. భార్య చితి ఆరకముందే కన్న పిల్లల్ని వదిలి చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకోవడం అందరినీ తీవ్రంగా కలిచి వేసింది.
News March 21, 2026
చిత్తూరు: ఐదుగురు DTలకు విధులు

గ్రూప్-2 పరీక్షల్లో DTలుగా ఎంపికైన వారిలో 16 మందిని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కేటాయించారు. చిత్తూరు జిల్లాకు 5 మందిని కేటాయించగా వారిలో.. శివకుమార్, మదన్ మోహన్ రెడ్డి, యస్థాని బాషా, సుధాకర్, శశికిరణ్ ఉన్నారు. వీరు ఏడాది పాటు రెవెన్యూ విభాగంలో ప్రొబేషన్ కింద జిల్లాలో విధులు నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ సుమిత్ కుమార్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
News March 21, 2026
అన్నమయ్య: ‘గ్యాస్’ సమస్యలా.. కాల్ చేయండి..!

అన్నమయ్య జిల్లాలోని 31 గ్యాస్ ఏజెన్సీలకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసినట్లు జేసీ శివ నారాయణ శర్మ తెలిపారు. కలెక్టరేట్‌లో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు, ఏజెన్సీలతో శనివారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో గ్యాస్ సరఫరాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. సమస్యలపై 08571-293001కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.


