News August 21, 2025
‘గో బ్యాక్ మార్వాడీ’.. రేపు యాదాద్రి జిల్లా బంద్

యాదాద్రి భువనగిరి జిల్లాలో ‘గో బ్యాక్ మార్వాడీ’ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో రేపు జిల్లా బంద్‌కు సభ్యులు పిలుపునిచ్చారు. మార్వాడీల వ్యవస్థను నిర్మూలించాలని, తెలంగాణ సంస్కృతిని, ప్రజలను కించపరుస్తున్నారని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు JAC ప్రకటించింది. JAC జిల్లా అధ్యక్షుడు రాజేశ్ నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను హేళన చేస్తున్న మార్వాడీల వైఖరిని ఖండించారు.
Similar News
News March 19, 2026
కర్నూలు: ప్రేమ వివాహానికి ప్రతీక ‘పిడకల సమరం’

కర్నూ(D) ఆస్పరి మండలం కైరప్పలలో ఉగాది పండుగ సందర్భంగా వీరభద్ర ఆలయానికి ఓ ప్రత్యేక కథ ఉంది. భద్రకాళి, వీరభద్రుడి ప్రేమ వివాహం వివాదంగా మారిందని, పండుగ మరుసటి రోజు ఇక్కడి భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి పేడతో చేసిన పిడకలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ సంప్రదాయ భక్తిని కొనసాగిస్తారని పురాణాల్లో ఉంది. ఈ పిడకల సమరాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్థులు భారీగా తరలి వస్తారు.
News March 19, 2026
గ్యాస్, క్రూడ్ డేటా ఇవ్వండి.. ఆయిల్ కంపెనీలకు కేంద్రం ఆదేశం

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాకు ఆటంకం కలగకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా చమురు, గ్యాస్ కంపెనీలు తమ వద్ద ఉన్న నిల్వలు, ఉత్పత్తి, వినియోగం, దిగుమతులకు సంబంధించిన డేటాను తమకు ఇవ్వాలని ఆదేశించింది. దీని ఆధారంగా సప్లై చెయిన్‌ను మరింత సమర్థంగా పర్యవేక్షించడమే లక్ష్యమని పేర్కొంది.
News March 19, 2026
ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ నిజం కాదా?

ఇరాన్ 2 వారాల్లోనే న్యూక్లియర్ బాంబ్ తయారు చేసే అవకాశం ఉన్నందునే Feb 28న దాడులు చేశామని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే US మాజీ కౌంటర్ టెర్రరిజం చీఫ్ కెంట్ ఈ వాదనను కొట్టిపారేశారు. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారీని నిషేధిస్తూ గతంలో జారీ చేసిన ‘ఫత్వా’ను ఉల్లంఘించినట్లు ఎటువంటి ఆధారాలు లేదన్నారు. ఖమేనీ హత్య ఇరాన్‌ను మరింత రెచ్చగొట్టిందని, ఈ దాడుల వల్ల శాంతి నెలకొనే అవకాశం లేదని పేర్కొన్నారు.


