News August 21, 2025

భద్రాద్రి: నాయకుల హామీలు నీటి మూటలే !

image

గోదావరి వరద ముంపు నిర్వాసితులకు పాలకులు ఇచ్చిన హామీలు నీటి మూటలు అయ్యాయని తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి పున్నం చందు అన్నారు. సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి పాలకులకు లేదని గత మూడేళ్ల పరిణామాలు తెలియజేస్తున్నాయని చెప్పారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సారపాక, బూర్గంపాడులో గోదావరి వరద ముంపు కాలనీలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. సుమారు 100 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని చెప్పారు.

Similar News

News March 13, 2026

రాజీకి అవకాశం ఉన్న కేసులను ముందుగా గుర్తించాలి: VZM SP

image

జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో రేపు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ పోలీసు అధికారులను శుక్రవారం ఆదేశించారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను ముందుగా గుర్తించి ఇరు వర్గాలతో చర్చలు జరిపి పరిష్కారం చేయాలని సూచించారు. ఇందుకోసం పోలీస్ స్టేషన్ల స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని తెలిపారు.

News March 13, 2026

ఘనంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం: జేసీ

image

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ-PM కిసాన్ నిధులు విడుదల కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. జిల్లాలోని 6 నియోజకవర్గాల పరిధిలో పెనుకొండ, అమరాపురం, బత్తలపల్లి, లేపాక్షి, బుక్కపట్నం, నల్లచెరువు కేంద్రాలలో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగిందన్నారు. రైతులు ఈ నిధులను సాగు ఖర్చులకు వినియోగించుకోవాలని జేసీ తెలిపారు.

News March 13, 2026

సూర్యాపేట: టెన్త్ పరీక్షా కేంద్రాల్లో వైద్య శిబిరాలు

image

పదో తరగతి పరీక్షల దృష్ట్యా జిల్లాలోని 69 కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు DMHO డాక్టర్ వెంకటరమణ తెలిపారు. సూర్యాపేటలో 41, కోదాడలో 28 కేంద్రాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలని, ఎండల తీవ్రత దృష్ట్యా వెంట మంచి నీళ్ల బాటిల్ తెచ్చుకోవాలని సూచించారు. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే వెంటనే సిబ్బందిని సంప్రదించాలని కోరారు.