News August 21, 2025
ఎన్టీఆర్: B.A.LL.B పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో B.A.LL.B కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ (రెగ్యులేషన్ 2018, 2023) థియరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. సెప్టెంబర్ 16, 18, 20, 23వ తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వర్శిటీ పరిధిలోని కాలేజీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని అధ్యాపకులు తెలిపారు. పూర్తి వివరాలకు https://kru.ac.in/ చూడాలని కోరారు.
Similar News
News March 17, 2026
విశాఖ తీరంలో మృతదేహం కలకలం

విశాఖ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి వైఎంసీఏ బీచ్ సమీపంలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 50 నుంచి 60 ఏళ్ల వయస్సు గల వ్యక్తి సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. త్రీటౌన్ సీఐ పైడయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడిని గుర్తించిన వారు వెంటనే త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.
News March 17, 2026
ప్రకాశం: పంచాయతీలకు ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేక అధికారులు

జిల్లాలో పంచాయితీ సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ఏప్రిల్ 2 నుంచి జిల్లాలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోందని DPO వెంకటేశ్వరరావు అన్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీల అభివృద్ధికి అధికారుల ద్వారా పాలన సాగుతుందని చెప్పారు. ప్రకాశం జిల్లాలోని 27 మండలాల్లో 519 పంచాయతీలు, మార్కాపురం జిల్లాలో 21 మండలాలకు 405 మంది అధికారులు ఉంటారన్నారు.
News March 17, 2026
విశాఖ: ఒకే వేదికపై ప్రత్యర్థులు

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దంపతుల 40వ వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గత ఎన్నికల్లో పరస్పర విమర్శలతో హోరెత్తించిన గంటా, అవంతి శ్రీనివాసరావు ఈ వేడుకలో చెట్టాపట్టాల్ వేసుకొని కనిపించడం విశేషం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, తదితర ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.


