News August 21, 2025

‘మార్వాడీ గో బ్యాక్.. రేపు హాలియా బంద్

image

నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియా మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం హాలియా మొబైల్స్ అసోసియేషన్ స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది. ‘మార్వాడీ గో బ్యాక్’ నినాదంతో ఓయూ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు హాలియాలో స్వచ్ఛంద బంద్ చేపట్టినట్లు చెప్పారు. మార్వాడీలు నాసిరకం సామగ్రిని తక్కువ ధరకు అమ్ముతూ కస్టమర్లని, లోకల్ వ్యాపారస్థులను నష్ట పరుస్తున్నారని ఆరోపించారు.

Similar News

News March 20, 2026

పలమనేరు మాజీ MLA మృతి

image

పలమనేరు మాజీ MLA ఠాణేదార్ చిన్న (TC) రాజన్ (106) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు‌. 1967లో స్వతంత్ర పార్టీ తరఫున పలమనేరు నుంచి MLAగా విజయం సాధించారు. నిస్వార్థ స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తింపు పొందారు. ఆస్తులు, సొంత ఇల్లు లేకుండా నిరాడంబరంగా జీవించారు. ప్రభుత్వ పెన్షన్‌తో జీవనం సాగించారు.

News March 20, 2026

ఈరోజు స్కూళ్లు యధాతథం: విశాఖ డీఈవో

image

రంజాన్ పండుగ సెలవులో మార్పు చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి (DEO) ప్రేమ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. క్యాలెండర్ ప్రకారం ఈరోజు ఉన్న సెలవును రద్దు చేసి, దానిని రేపటికి (శనివారం) మారుస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈరోజు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు యధాతథంగా పనిచేస్తాయని, రేపు మాత్రం సెలవు ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని కోరారు.

News March 20, 2026

శ్రీకాకుళం జిల్లాలో భారీ సైబర్ మోసం..!

image

శ్రీకాకుళం పట్టణంలోని పీ. ఎన్ కాలనీకి చెందిన విశ్రాంత జిల్లా వైద్యారోగ్య శాఖధికారి కృష్ణమోహన్‌ డిజిటల్ అరెస్టుకు గురయ్యరు. తన వద్ద సైబర్ నేరగాళ్లు రూ.56 లక్షలు కాజేశారని గురువారం 2-టౌన్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. తనకు హ్యూమన్ ట్రాఫికింగ్‌తో సంబంధాలు ఉన్నాయని, కేసు నమోదు అయిందని, డిజిటల్ అరెస్ట్ చేసినట్లు బెదిరించి సొమ్ము కాజేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.