News August 21, 2025

NLG: హర్పాల్ సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

image

ఎస్ఎల్‌బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడానికి ఇరిగేషన్ శాఖ సలహాదారుడిగా మాజీ లెఫ్ట్‌నెంట్ జనరల్ హర్పాల్ సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. డిఫెన్స్ ఇంజినీరింగ్ విభాగంలో 40 ఏళ్ల అనుభం కలిగిన ఆయన రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. ఎలాంటి జీతభత్యాలు తీసుకోకుండా ఆయన సేవలందిస్తారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ అభ్యర్థన మేరకు తెలంగాణలో పనిచేయడానికి ఆయన అంగీకరించారు.

Similar News

News August 22, 2025

మెదక్: ‘విద్యారంగాన్ని బలోపేతం చేయాలి’

image

ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి జగదీష్ అన్నారు. మెదక్ పట్టణంలో బీ.సీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థినిలకు అందిస్తున్న ఆహారం నాణ్యత, తాగునీరు, తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News August 22, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 22, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 22, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.46 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.01 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.19 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.46 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.37 గంటలకు
✒ ఇష: రాత్రి 7.52 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.