News August 21, 2025
కోనసీమను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చాలి: జేసీ

కోనసీమ జిల్లాను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రజలందరూ సహకరించాలని జాయింట్ కలెక్టర్ నిశాంతి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ సంచులకు బదులుగా జ్యూట్ సంచులను ఉపయోగించాలని సూచించారు. రైతుబజార్లలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, దాని వల్ల కలిగే అనర్థాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. జిల్లాను పరిశుభ్రంగా ఉంచడానికి పౌరులంతా తమవంతు బాధ్యతగా ప్లాస్టిక్‌ను దూరం పెట్టాలని ఆమె పేర్కొన్నారు.
Similar News
News August 22, 2025
ఇండస్ట్రీ అభివృద్ధికి రేవంత్ కృషి అభినందనీయం: చిరంజీవి

ఇండస్ట్రీ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించి, అటు నిర్మాతలు, ఇటు కార్మికులకు సమన్యాయం చేసిన సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘ఇండస్ట్రీ అభివృద్ధికి రేవంత్ చర్యలు అభినందనీయం. ప్రపంచ చలనచిత్ర రంగానికే హైదరాబాద్‌ను ఓ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నారు. టాలీవుడ్‌కు ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండలు అందిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.
News August 22, 2025
ఆగస్టు 22: చరిత్రలో ఈరోజు

1922: చింతపల్లి పోలీస్‌స్టేషన్‌పై అల్లూరి సీతారామరాజు దాడి
1932: నృత్యకారుడు, నటుడు గోపీకృష్ణ జననం
1955: మెగాస్టార్ చిరంజీవి జననం
1984: తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు బొమ్మకంటి సత్యనారాయణ రావు మరణం
1989: గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ జననం
2014: జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత అనంతమూర్తి మరణం
* ప్రపంచ జానపద దినోత్సవం
News August 22, 2025
మెదక్: ‘విద్యారంగాన్ని బలోపేతం చేయాలి’

ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి జగదీష్ అన్నారు. మెదక్ పట్టణంలో బీ.సీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థినిలకు అందిస్తున్న ఆహారం నాణ్యత, తాగునీరు, తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.