News August 21, 2025
భువనగిరి: పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

భువనగిరి మండలం నందనం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ఎంత మంది ఉన్నారని, ఈ సంవత్సరం ఎన్ని అడ్మిషన్స్ వచ్చాయని స్కూల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ఇంగ్లిష్ పాఠాలు చదివించారు. సంఖ్య తక్కువగా ఉందని, మళ్లీ గ్రామంలో ‘బడిబాట’ నిర్వహించి కొత్త విద్యార్థులు చేరేలా చూడాలన్నారు.
Similar News
News March 12, 2026
మళ్లీ 100 డాలర్లకు ఆయిల్ ధర

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర $100 దాటింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత $120 చేరువైన రేట్లు.. ఉద్రిక్తతలు ముగింపునకు వచ్చిందన్న ట్రంప్ ప్రకటనతో ఇటీవల $89కు దిగొచ్చాయి. కానీ తాజాగా హార్ముజ్‌లో చమురు నౌకలపై ఇరాన్ దాడి, ఇరాక్ సహా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ నిల్వ కేంద్రాలపై దాడితో ఆయిల్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి.
News March 12, 2026
ఉలవ పంటలో బూడిద తెగులు – నివారణ

అధిక తేమ, రాత్రి, పగలు ఉష్ణోగ్రతల్లో ఎక్కువ వ్యత్యాసం ఉన్నప్పుడు ఉలవ పంటలో బూడిద తెగులు వ్యాపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి కార్బండిజం 50% W.P 1గ్రామును కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటే ఇదే మందును ఇదే మోతాదులో 15 రోజుల వ్యవధిలో రెండోసారి కూడా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News March 12, 2026
భద్రాచలం: భారీ సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమానికి భారీ విఘాతం కలిగింది. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి చెందిన 108 మంది మావోయిస్టులు రాష్ట్ర DGP అరుణ్ దేవ్ గౌతమ్ ఎదుట లొంగిపోయారు. వీరిచ్చిన సమాచారంతో పోలీసులు జరిపిన గాలింపులో భారీ డంపు బయటపడింది. ఇందులో ₹3.65 కోట్ల నగదు, ₹1.64 కోట్ల విలువైన బంగారంతో పాటు AK-47, LMG వంటి 101 అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు చరిత్రలో ఇది అతిపెద్ద లొంగుబాటు.


