News August 21, 2025
ములుగు: త్వరలో కొత్త ఆధార్ కేంద్రాలు

ములుగు జిల్లాలో త్వరలోనే కొత్త ఆధార్ కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు జారీ చేస్తామని ఈ-ఆధార్, మేనేజర్ దేవేందర్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ కార్యాలయంలో నూతన ఆధార్ సాఫ్ట్‌వేర్‌పై నిర్వాహకులకు గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నూతన సాఫ్ట్‌వేర్‌తో ఆధార్ సేవలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు. ఆధార్ కేంద్రాల నిర్వాహకులు దరఖాస్తుదారుల నుంచి అదనపు రుసుము వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News March 18, 2026
సిద్దిపేట పనుల రద్దుపై రేవంత్ సమాధానం చెప్పాలి: బీఆర్ఎస్

సిద్దిపేట జిల్లాలో గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 1070 కోట్ల అభివృద్ధి పనులను రద్దు చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం సిద్దిపేటలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ.. అభివృద్ధి పనులను రద్దు చేసి సిద్దిపేట ప్రజలను వంచించడం తగదన్నారు. ఈ పనులపై స్పష్టత ఇచ్చిన తర్వాతే సీఎం జిల్లాలో అడుగుపెట్టాలన్నారు.
News March 18, 2026
శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు.. వేల సంఖ్యలో తరలివస్తున్న కన్నడిగులు

AP: ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైలానికి కన్నడ భక్తులు పోటెత్తుతున్నారు. నల్లమల అడవుల్లో వందలాది కి.మీ నడుచుకుంటూ క్షేత్రానికి చేరుకుంటున్నారు. మహారాష్ట్ర నుంచీ భక్తులు వస్తుండటం విశేషం. వీరంతా కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి మల్లన్న మొక్కులు తీర్చుకుంటున్నారు. 3 రోజుల్లోనే 2 లక్షల మంది స్వామిని దర్శించుకోవడం గమనార్హం. ఉత్సవాలు ఎల్లుండితో ముగియనున్నాయి.
News March 18, 2026
గద్వాల్: గ్యాస్ కొరత లేదు.. ఆందోళన వద్దు: కలెక్టర్

జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, వినియోగదారులు నిబంధనలు పాటిస్తూ అపోహలు వీడాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. బుధవారం గద్వాల పట్టణంలోని రాఘవేంద్ర, ధనుష్ గ్యాస్ ఏజెన్సీలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత మరో బుకింగ్‌కు 45 రోజుల గడువు ఉండాలన్నారు. ఆ లోపు బుక్ చేస్తే ఓటీపీ రాదన్నారు.


