News August 21, 2025

తాండూరు: ఒక్కరైతే ఒంటరే.. ఒక్కటైతే ఉప్పెనే

image

ఒక్కరైతే ఒంటరే.. ఒక్కటైతే ఉప్పెనే అని PRTU జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి తెలిపారు. శుక్రవారం తాండూరులో సెప్టెంబర్ 1న పెన్షన్ విగ్రహ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహాధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. CPSను రద్దుచేసి OPSను అమలుపరచాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న ఇందిరా పార్కు వద్ద నిర్వహించే మహాధర్నాకు ఉపాధ్యాయులు సెలవు పెట్టుకొని రావాలని పిలుపునిచ్చారు.

Similar News

News March 14, 2026

గ్యాస్ సిలిండర్ల కొరత లేదు: కలెక్టర్ రాజర్షిషా

image

ఆదిలాబాద్ జిల్లాలో గృహ అవసరాలతో పాటు విద్యాలయాలు, ఆసుపత్రులకు అవసరమైన ఎల్.పీ.జీ. సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని, సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్‌తో కలిసి గ్యాస్ ఏజెన్సీల డీలర్లు, చమురు కంపెనీల సేల్స్ అధికారులు, అధికారులతో ఆయన సమీక్షా నిర్వహించారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

News March 14, 2026

అక్రమంగా గ్యాస్ నిల్వ చేస్తే కఠిన చర్యలు: ADB కలెక్టర్

image

ఆసుపత్రులు, వసతి గృహాలు, అనాధ శరణాలయాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అధికారులకు సూచించారు. గృహ అవసరాలకు కేటాయించిన డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించినా, అక్రమంగా నిల్వ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టేందుకు పౌర సరఫరాల అధికారులు, డిటిలు, ఎస్ఐలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

News March 14, 2026

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్

image

జిల్లాలో రెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు. ప్రతీ సోమవారం రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహించి మ్యుటేషన్లు, అసైన్‌మెంట్, డాటెడ్ ల్యాండ్స్ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. డిసెంబర్ చివరి వారం నుంచి ఇప్పటివరకు వచ్చిన 1,523 దరఖాస్తుల్లో 724 పరిష్కరించగా, మిగిలినవి పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.