News August 21, 2025

మెదక్ జిల్లా ఖజానా శాఖ ఏడీగా అనిల్ కుమార్ బాధ్యతలు

image

మెదక్ జిల్లా ఖజానా శాఖ సహాయ సంచాలకులుగా(ఏడీ) అనిల్ కుమార్ మరాటి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన అంతకుముందు కలెక్టర్ రాహుల్ రాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ట్రెజరీ కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బందితో సమన్వయంగా విధులు నిర్వహిస్తానని అనిల్ తెలిపారు. ఎస్టీఓ వేణుగోపాల్, జూనియర్ అకౌంటెంట్ యాదగిరి తదితరులున్నారు.

Similar News

News March 13, 2026

మెదక్: టెన్త్ విద్యార్థులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం

image

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు మెదక్ డీఈఓ విజయ తెలిపారు. బాలురు తమ హాల్ టికెట్ చూపిస్తే చాలు.. రూట్లతో సంబంధం లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. బాలికలకు ఆధార్ కార్డు ద్వారా మహాలక్ష్మి పథకం కింద ఉచిత సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు భయం వీడి, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

News March 13, 2026

పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలు: ఎస్పీ

image

మెదక్ జిల్లాలో పదో తరగతి పరీక్షల కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జిల్లాలోని అన్ని కేంద్రాల వద్ద 163 BNSS అమలులో ఉంటుందని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు.

News March 13, 2026

నర్సాపూర్: ‘గ్యాస్ కొరత సృష్టిస్తే జైలుకే’

image

జిల్లాలో కృత్రిమ గ్యాస్ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్ఓ నిత్యానంద్ హెచ్చరించారు. నర్సాపూర్‌లో పలు హోటళ్లు, రీఫిల్లింగ్ కేంద్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 47 సిలిండర్లను స్వాధీనం చేసుకుని, నిత్యావసర వస్తువుల చట్టం 6A కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గ్యాస్ అక్రమ విక్రయాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.