News August 21, 2025

సూర్యాపేట: జాన్‌పహాడ్ పంచాయతీ కార్యదర్శి అరెస్ట్

image

జాన్‌పహాడ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇంజమూరి వెంకయ్యను గురువారం ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పంచాయతీ కార్యదర్శి లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేసిన నేపథ్యంలో విచారించి, ఆయనపై కేసు నమోదు చేశామన్నారు. అనంతరం హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.

Similar News

News March 13, 2026

ప్రశాంతంగా ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు

image

భద్రాద్రి జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు DIEO వెంకటేశ్వర్లు తెలిపారు. కెమిస్ట్రీ, కామర్స్ పేపర్–II పరీక్షలకు 37 కేంద్రాల్లో మొత్తం 7,885 మంది విద్యార్థులకు గానూ 7,641 మంది హాజరయ్యారు. 244 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, పరీక్షలు సజావుగా సాగాయని స్పష్టం చేశారు.

News March 13, 2026

గ్యాస్‌ కొరతపై అపోహలు వద్దు: కలెక్టర్‌ అంకిత్‌

image

జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్‌ సరఫరాపై ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్‌ అంకిత్‌ స్పష్టం చేశారు. గ్యాస్‌ నిల్వలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పాల్గొన్నారు. గ్యాస్‌ సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెట్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 13, 2026

ADB: స్కాలర్ షిప్స్ నేరుగా అకౌంట్‌లో జమ

image

జిల్లాలోని ఎస్సీ విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరానికి గాను చెల్లించాల్సిన బోధన రుసుములు (ట్యూషన్ ఫీజులు) ఉపకార వేతనాలను నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత కుమారి తెలిపారు. మంజూరైన డబ్బుల్లో విద్యార్థుల నిర్వహణకు కొంత డబ్బులు మినహాయించుకొని మిగతా మొత్తాన్ని ట్యూషన్ ఫీజు కింద కళాశాలలకు చెల్లించాలని సూచించారు.