News April 1, 2024
రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలి : శాంతికుమారి

అన్ని ప్రాంతాలలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం ఆమె హైదరాబాద్ నుండి ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లతో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం, తాగునీరు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు.
Similar News
News March 14, 2026
మిర్యాలగూడ: వాగులో పడి రైతు మృతి

మిర్యాలగూడ మండలం తడకమళ్లకి చెందిన అనంతుల లింగయ్య పొలానికి వెళ్లే సమయంలో పాలేరు వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా వాగులో మృతదేహం లభ్యమైంది. మృతుని కుమారుడు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై లక్ష్మయ్య తెలిపారు.
News March 14, 2026
పుకార్లు నమ్మొద్దు.. మోసపోవద్దు: నల్గొండ కలెక్టర్

జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాకు సంబంధించి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని నల్గొండ కలెక్టర్ స్పష్టం చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ దొరకదనే పుకార్లను నమ్మి అధిక ధరలకు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు. జిల్లాలోని 33 ఏజెన్సీల ద్వారా బుకింగ్ చేసిన 4 నుంచి 5 రోజుల్లోపు సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం ఏజెన్సీల వద్ద 8118 సిలిండర్ల నిల్వలు ఉన్నాయని తెలిపారు.
News March 13, 2026
వాడపల్లి కేసులో వివరణ కోరిన మానవ హక్కుల సంఘం

వాడపల్లి పోలీసుల కస్టడీలో గిరిజన యువకుడు సాయి సిద్ధుపై జరిగిన చిత్రహింసల ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. బాధితుడికి రూ.50 వేల నష్టపరిహారం ఎందుకు చెల్లించకూడదో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయాన్ని హైకోర్టు న్యాయవాది రేవంత్ వెల్లడించారు.


