News August 21, 2025

కోరుట్ల: రాజశ్రీకి ASIగా పదోన్నతి

image

కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రాజశ్రీ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ASI )గా పదోన్నతి పొందారు. ఈ సందర్బంగా గురువారం ఆమెకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ASI పదోన్నతి స్టార్ చిహ్నాన్ని అలంకరించి పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు. పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా విధులు నిర్వహించాలని సూచించారు.

Similar News

News March 20, 2026

కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. నోటిఫై చేసిన కేంద్రం

image

FY 2026-27 APR 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్‌ను కేంద్రం నోటిఫై చేసింది. ఇందులో భాగంగా HYD, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్‌ నగరాలను మెట్రో జాబితాలో చేర్చి HRA మినహాయింపును 50%కి పెంచడం విశేషం. దీని ద్వారా రెంట్‌లో ఎక్కువ భాగాన్ని ట్యాక్స్ ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ట్రాన్స్‌పరెన్సీ పెంచేలా క్యాపిటల్ గెయిన్స్, NRI పన్ను నిబంధనలను కూడా ప్రభుత్వం కఠినతరం చేసింది.

News March 20, 2026

భద్రాద్రి శిఖరంపై అద్భుతం.. సుదర్శన చక్రం

image

భద్రాచల పుణ్యక్షేత్రంలో గర్భగుడి శిఖరంపై ఉన్న సుదర్శన చక్రం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. క్రీ.శ. 1675లో భక్త రామదాసు ఆలయ నిర్మాణ సమయంలో దీనిని ప్రతిష్ఠించారు. 350 ఏళ్లు గడిచినా నేటికీ ఈ దివ్య చక్రం చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఈ చక్రాన్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. రామ మహిమకు ఇది నిదర్శనమని భక్తులు కొనియాడుతున్నారు.

News March 20, 2026

కేంద్రీయ గిరిజన యూనివర్సిటీకి సహకారం: భట్టి

image

ములుగు జిల్లాలో నిర్మిస్తున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగంలో ఈ మేరకు ఆయన వెల్లడించారు. ఆదివాసీ గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గిరిజన్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్‌ను మరింత విస్తరిస్తామని తెలిపారు.