News August 21, 2025

గుంటూరు జిల్లా TODAY TOP NEWS

image

☞ కొండవీటి వాగు డ్రోన్ విజువల్స్. 
☞ గంజాయి కేసులో ఇద్దరు గుంటూరు వ్యక్తులు అరెస్ట్.
☞ తెనాలి: యువకుడిని బెదిరించి దారి దోపిడీ.
☞ గంజాయి కేసులో 14 మంది అరెస్ట్.
☞ తుళ్లూరు పోలీస్ స్టేషన్ అంటే పోలీసులకే భయం.
☞ మంగళగిరి: మంగళగిరిలో పొల్యూషన్ బోర్డు తనిఖీలు. 
☞ పొన్నూరు: పోలీసుల విచారణకు హాజరైన అంబటి మురళీ. 
☞ డిజిటల్ ఐడీలపై దృష్టి పెట్టాలి: DMHO.

Similar News

News March 13, 2026

అమరావతి అగ్నిప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశం

image

అమరావతి ప్రాంతంలోని మందడం దగ్గర జరిగిన భారీ మంటల ఘటనపై CM చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల సమావేశంలోని టీ సమయంలో ఉన్నతాధికారులతో ఈ అంశాన్ని చర్చించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పరిశీలించాలని సూచించారు. నిర్మాణ పనులకు ఉపయోగించే సామగ్రి నిల్వ ఉన్న ప్రదేశంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో జరిగిన నష్టం, పరిస్థితులపై పూర్తి వివరాలు ఇవ్వాలన్నారు.

News March 13, 2026

గుంటూరు: ఈ నంబర్‌తో పోలీస్ సేవలు..!

image

గుంటూరు జిల్లా ప్రజలు మన మిత్ర – వాట్సాప్ గవర్నెన్స్ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. 95523 00009 నంబర్‌కు వాట్సాప్‌లో హాయ్ అని సందేశం పంపితే FIR కాపీ, కేసు స్థితి, ఈ-చలానా వివరాలు వంటి పోలీస్ సేవలు మొబైల్‌లోనే పొందవచ్చన్నారు. సైబర్ క్రైమ్ ఫిర్యాదులకు 1930, అత్యవసర పోలీస్ సహాయానికి 112 కు కాల్ చేయాలని సూచించారు.

News March 13, 2026

GMCలో అవినీతికి పాల్పడ్డ సెక్రటరీ సస్పెండ్

image

అవినీతికి పాల్పడిన గుంటూరు నగరపాలక సంస్థ సెక్రటరీ ఎ.పవన్ కుమార్ పై గురువారం సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేయాలని అధికారులను నగర కమిషనర్ కె. మయూర్ అశోక్‌ను కోరారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల సొమ్ము (ఆస్తి పన్ను, LRS) సొంతానికి వాడుకోవడం, తక్కువ మొత్తానికి నకిలీ రశీదులు సృష్టించి ప్రభుత్వం, ప్రజలను మోసం చేయడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.