News August 21, 2025
ఏపీఎం టెర్మినల్స్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం

AP: పోర్టుల అభివృద్ధి, సౌకర్యాలపై APM టెర్మినల్స్ సంస్థతో CM చంద్రబాబు సమక్షంలో ఏపీ మారిటైం బోర్డు ఒప్పందం చేసుకుంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో ₹9వేల కోట్లతో టెర్మినల్స్, కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. దీని వల్ల దాదాపు 10,000 మందికి ఉపాధి లభించనుంది. APని తూర్పు దేశాలకు సముద్ర ద్వారంగా, లాజిస్టిక్స్ హబ్‌గా మార్చడానికి కట్టుబడినట్లు CM పేర్కొన్నారు.
Similar News
News August 22, 2025
పెన్షన్లపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

AP: సదరం సర్టిఫికెట్ల పున:పరిశీలనలో ఏ ఒక్క దివ్యాంగుడికి అన్యాయం జరగకూడదని CM చంద్రబాబు అధికారులకు సూచించారు. తాత్కాలిక సర్టిఫికెట్ల ద్వారా పెన్షన్ పొందేవారికి ఎప్పటిలా పింఛన్ అందించాలని ఆదేశించారు. పెన్షన్లపై ఉన్నతాధికారులతో CM సమీక్ష నిర్వహించారు. ‘అడ్డదారిలో సదరం సర్టిఫికెట్లు పొందినవారిపై ఖచ్చితమైన పరిశీలన చేయాలి. అవసరమైతే దివ్యాంగులకు పంపిన నోటీసులను వెనక్కి తీసుకోవాలి’ అని ఆదేశించారు.
News August 22, 2025
ఇండస్ట్రీ అభివృద్ధికి రేవంత్ కృషి అభినందనీయం: చిరంజీవి

ఇండస్ట్రీ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించి, అటు నిర్మాతలు, ఇటు కార్మికులకు సమన్యాయం చేసిన సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘ఇండస్ట్రీ అభివృద్ధికి రేవంత్ చర్యలు అభినందనీయం. ప్రపంచ చలనచిత్ర రంగానికే హైదరాబాద్‌ను ఓ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నారు. టాలీవుడ్‌కు ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండలు అందిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.
News August 22, 2025
ఆగస్టు 22: చరిత్రలో ఈరోజు

1922: చింతపల్లి పోలీస్‌స్టేషన్‌పై అల్లూరి సీతారామరాజు దాడి
1932: నృత్యకారుడు, నటుడు గోపీకృష్ణ జననం
1955: మెగాస్టార్ చిరంజీవి జననం
1984: తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు బొమ్మకంటి సత్యనారాయణ రావు మరణం
1989: గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ జననం
2014: జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత అనంతమూర్తి మరణం
* ప్రపంచ జానపద దినోత్సవం