News August 21, 2025

KMR: మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ ప్రారంభం

image

నేర దర్యాప్తులో సాంకేతికతను మరింత పెంచేందుకు రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం కామారెడ్డి జిల్లాకు కొత్తగా మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని అందించింది. SP రాజేశ్ చంద్ర, కామారెడ్డిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఈ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అత్యాధునిక పరికరాలతో కూడిన ఈ వాహనం నేరం జరిగిన ప్రదేశంలోనే సాక్ష్యాధారాలను సేకరించి, ప్రాథమిక పరీక్షలు నిర్వహించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Similar News

News March 23, 2026

తిరుమలలో మార్చి 30 నుంచి వసంతోత్సవాలు

image

తిరుమలలో ఈనెల 30 నుంచి ఏప్రిల్ 1 మధ్య శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ మూడు రోజులూ ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలతో పాటు మూడో రోజు అష్టాదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. ఏటా చైత్ర శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి తిథుల్లో స్వామివారికి ఈ వసంతోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా రెండు, మూడు రోజుల్లో శ్రీవారు మాడవీధుల్లో ఊరేగుతారు.

News March 23, 2026

అస్సాం ఓటర్లను ప్రభావితం చేసే అంశాలివే

image

అస్సాం లెజెండరీ సింగర్ జుబీన్ గార్గ్ మృతిపై విచారణ, CAA, NRC, చొరబాట్లు ఈసారి ఎన్నికలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది. సీనియర్ నేత భూపేన్ బోరా రాజీనామా, గొగొయ్ భార్య ఎలిజబెత్‌కు పాక్‌తో సంబంధాలంటూ హిమంత చేస్తున్న ఆరోపణలు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారొచ్చు. పదేళ్లుగా అధికారంలో ఉండటం, సీఎంపై వ్యతిరేకత బీజేపీ ఓటింగ్‌ను తగ్గించవచ్చు.
*126 స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్, మే 4న కౌంటింగ్.
<<-se>>#Elections2026<<>>

News March 23, 2026

కూతురితో ధోనీ.. PHOTO

image

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తన కూతురితో కలిసి దిగిన లేటెస్ట్ ఫొటో వైరల్ అవుతోంది. మహీ, జీవా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కూర్చొని ముచ్చటించుకోవడం అందులో కనిపించింది. ఈ ఫొటో బ్యూటిఫుల్‌గా ఉందని, అప్పుడే జీవా ఎదిగిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ధోనీకి 2010లో పెళ్లి అవ్వగా 2015లో పాప జన్మించింది.