News August 21, 2025
MHBD: యూరియా సరఫరా కొరత.. రైతుల నిరాశ

MHBDలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్దకు రైతులు టోకెన్ల కోసం వచ్చారు. అయితే, రాత్రి పొద్దుపోయే వరకు కూడా టోకెన్లు ఇవ్వకపోవడంతో వారు పడిగాపులు పడి నిరాశతో వెనుతిరిగి వెళ్లిపోయారు. ఉదయం నుంచి రాత్రి వరకు క్యూ లైన్లో వేచి ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు టోకెన్లు ఇవ్వకపోవడంపై రైతులు అగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి యూరియా అందించకపోవడంతో ప్రభుత్వంపై రైతులు మండిపడుతున్నారు.
Similar News
News August 22, 2025
Way2News కథనానాకి స్పందన.. వెలిగిన జనగామ బ్రిడ్జి లైట్లు

‘గాండాంధకారంగా జనగామ బ్రిడ్జి’ అనే శీర్షికతో ఇటీవల Way2News ప్రచురించిన కథనానికి స్పందన లభించింది. సంవత్సరం నుంచి లైట్లు సరిగా వెలగకపోవడంతో ప్రమాదాలు జరిగాయని స్థానికులు తెలిపారు. దీంతో వార్త ప్రచురించగా.. కలెక్టర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. బ్రిడ్జిపై ఉన్న లైట్లకు మరమ్మతులు చేయించి లైట్లు వెలిగేలా చేశారు. స్థానికులు Way2Newsకు కృతజ్ఞతలు తెలిపారు.
News August 22, 2025
భద్రాద్రి: CPIML రాష్ట్ర కార్యదర్శిపై వేటు

విప్లవ స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తూ, రహస్య జీవితానికి దూరంగా ఉంటూ లగ్జరీ జీవితానికి అలవాటు పడిన సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్‌ను బహిష్కరిస్తున్నట్లు కేంద్ర కమిటీ ప్రకటించింది. కార్లలో తిరుగుతూ, ఖద్దరు చొక్కాలు తొడుగుతూ అటు కుటుంబానికి, ఇటు వ్యక్తిగత అవసరాల కోసం డబ్బు వసూళ్లకు అలవాటు పడి ప్రతిఘటన పోరాట లైనుకు తూట్లు పొడిచారని, అతడితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.
News August 22, 2025
పెన్షన్లపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

AP: సదరం సర్టిఫికెట్ల పున:పరిశీలనలో ఏ ఒక్క దివ్యాంగుడికి అన్యాయం జరగకూడదని CM చంద్రబాబు అధికారులకు సూచించారు. తాత్కాలిక సర్టిఫికెట్ల ద్వారా పెన్షన్ పొందేవారికి ఎప్పటిలా పింఛన్ అందించాలని ఆదేశించారు. పెన్షన్లపై ఉన్నతాధికారులతో CM సమీక్ష నిర్వహించారు. ‘అడ్డదారిలో సదరం సర్టిఫికెట్లు పొందినవారిపై ఖచ్చితమైన పరిశీలన చేయాలి. అవసరమైతే దివ్యాంగులకు పంపిన నోటీసులను వెనక్కి తీసుకోవాలి’ అని ఆదేశించారు.