News August 21, 2025

‘ఈనెల 25 నాటికి డాక్యుమెంట్ల అప్లోడ్ పూర్తి’

image

ప్రభుత్వం సూచించిన విధంగా ప్రతి ప్రభుత్వ శాఖల్లో గల డాక్యుమెంట్ల అప్లోడ్ ఈనెల 25వ తేదీ నాటికి పూర్తవుతుందని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌కు వివరించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్, జేసీ ఎస్ఎస్.శోబిక, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 2, 2026

సంగారెడ్డి: డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలుపై కలెక్టర్ సమీక్ష

image

సంగారెడ్డి జిల్లాలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలు పురోగతిపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గురువారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ABHA ఖాతాల నమోదు పెంచాలని, ప్రతి రోగికి తప్పనిసరిగా ఐడీ నమోదు చేయాలని ఆమె సూచించారు. ఓపీ స్లిప్‌లు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌లను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో అప్లోడ్ చేయాలని, ఫార్మసీ సేవలను కూడా డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు.

News April 2, 2026

గద్వాల: 76 మంది విద్యాశాఖ సిబ్బందికి కలెక్టర్ నోటీసులు

image

గద్వాల జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో FRS హాజరు నమోదులో నిర్లక్ష్యం వహించిన 76 మంది సిబ్బందికి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రతిరోజూ నిర్ణీత సమయానికి హాజరు నమోదు చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించే వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

News April 2, 2026

చిత్తూరు: హెల్మెట్ పెట్టుకుంటే బహుమతులు

image

చిత్తూరు ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు హెల్మెట్ పెట్టు- బహుమతి పట్టు కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా హెల్మెట్ పెట్టుకున్న వారికి ప్రోత్సాహక బహుమతులు అందించాలని నిర్ణయించారు. ముఖ్య ట్రాఫిక్ కూడళ్లలో పోలీసులు అందజేసే స్లిప్పులను పూర్తి చేసి వివరాలు నమోదు చేయాలి. వారాంత, నెలసరి బహుమతులు అందిస్తామని పేర్కొంటున్నారు. వాటితో పాట సర్టిఫికెట్లు, మెమెంటోలు అందిస్తామన్నారు.