News August 21, 2025
జీ.మాడుగులలో కరెంట్ షాక్‌తో ఇద్దరి మృతి

జీ.మాడుగుల మండలంలోని బోయితెలి గ్రామం సమీపంలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిపై ఆకస్మికంగా కరెంట్ తీగలు పడటంతో, విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం ప్రకారం.. మరణించిన వారు నర్సీపట్నం ప్రాంతానికి చెందినవారని తెలిపారు. ఘటనపై పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 13, 2026
వార్ ఎఫెక్ట్.. కేంద్రానికి భారంగా ఫర్టిలైజర్ సబ్సిడీ!

ఇరాన్ యుద్ధంతో చమురు ధరలు పెరగడం, సరఫరాలో అంతరాయాల కారణంగా ఎరువుల సబ్సిడీ ఖర్చు కేంద్రానికి భారంగా మారనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ సబ్సిడీల బడ్జెట్ అంచనా ₹1.7లక్షల కోట్లు కాగా ఇప్పుడది ₹2.2 లక్షల కోట్లకు చేరొచ్చని కేంద్రవర్గాల సమాచారం. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం ₹1.71లక్షల కోట్లలో ఫర్టిలైజర్ సబ్సిడీకి ₹1.16లక్షల కోట్లు, నాన్-యూరియా ఫర్టిలైజర్స్‌కు ₹54వేల కోట్లను కేంద్రం కేటాయించింది.
News March 13, 2026
హార్ముజ్‌లో నౌకలకు రక్షణ ఇవ్వలేం.. చేతులెత్తేసిన అమెరికా!

హార్ముజ్ జలసంధిని దాటుకొని నౌకలు <<19338961>>ధైర్యంగా వెళ్లాలని<<>> చెప్పిన అమెరికా ఇప్పుడు చేతులెత్తేసింది. ‘హార్ముజ్ నుంచి వెళ్లే నౌకలకు రక్షణ కల్పించలేం. ప్రస్తుతానికి మేం రెడీగా లేము. ఇరాన్‌పై దాడులు చేయడంపైనే మా సైన్యం దృష్టి ఉంది. ఈ నెలాఖరుకు ఎస్కార్ట్ కల్పించే ఛాన్స్ ఉంది’ అని US ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ చెప్పారు. ఇవాళ US షిప్‌పై ఇరాన్ <<19364482>>దాడి చేయడం<<>> తెలిసిందే.
News March 13, 2026
వేములవాడలో కార్పెంటర్ ఆత్మహత్య

చందుర్తి మండలానికి చెందిన రాజూరి వీరాచారి (45) అనే కార్పెంటర్ గురువారం వేములవాడ శివారులోని కోనాయిపల్లెలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన్నేళ్లుగా వేములవాడలో నివాసం ఉంటున్న ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


