News August 21, 2025

రేపు ఆమనగల్లు బంద్

image

ఆమనగల్లుకు కొందరు నార్త్ ఇండియా నుంచి వచ్చి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని స్థానిక వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. మార్వాడీలు అన్ని వ్యాపారాలకు విస్తరిస్తున్నారని, వాళ్ల మనుషులకే ఉద్యోగాలు ఇస్తుండటంతో స్థానికులకు ఉపాధి లభించట్లేదంటున్నారు. ఇందుకు వ్యతిరేకంగా రేపు ఆమనగల్లు బంద్‌కు స్థానిక వ్యాపారులు పిలుపునిచ్చారు.

Similar News

News August 21, 2025

HYD: నేటి నుంచి ప్రత్యేక శానిటేషన్ స్పెషల్ డ్రైవ్

image

GHMCలో నేటి నుంచి ఈ నెల 25 వరకు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు GHMC కమిషనర్ కర్ణన్ తెలిపారు. వర్షాకాలంలో వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను నివారించడానికి పరిసరాల పరిశుభ్రత ఎంతో అవసరమన్నారు. వాతావరణశాఖ సూచనల ప్రకారం రాబోయే రోజుల్లో వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉండడంతో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాల తొలగింపునకు ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.

News August 20, 2025

కొందుర్గు: కలెక్టర్‌కు లేఖ రాసిన విద్యార్థులు

image

కొందుర్గు మండలం చెరుకుపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జిల్లా కలెక్టర్, డీఈఓకు లేఖ రాశారు. తమ పాఠశాలలో పనిచేస్తున్న సుష్మ అనే టీచర్ గండిపేట పాఠశాలకు డిప్యూటేషన్‌పై వెళ్లారని, దీంతో తమ పాఠశాలలో శివారెడ్డి అనే టీచర్ ఒకరే ఉండడంతో చదువు బోధించడం ఇబ్బందిగా మారిందని, వెంటనే సుష్మ టీచర్‌ను తమ పాఠశాలకు పంపించాలని విద్యార్థులు కోరారు.

News August 19, 2025

4,600 పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి: రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్

image

రంగారెడ్డి జిల్లాకు కొత్తగా వచ్చిన అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డిని భూమికి సంబంధించిన ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయంటూ బాధితులు వచ్చి కలుస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అడిషనల్ కలెక్టర్ ఆఫీస్ గోడపై బోర్డులు ఏర్పాటు చేశారు. ‘నా వద్ద 4,600 పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి.. వీటిని క్లియర్ చేయడానికి నాకు సమయం పడుతుంది.. దయచేసి సహకరించండి’ అంటూ ఇలా నోటీస్ అంటించి బాధితులని కోరుతున్నారు.