News August 22, 2025

సోలార్ విద్యుత్ సిస్టం ఏర్పాటు: KMR కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులపై సోలార్ విద్యుత్ సిస్టం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలతో జాబితా సిద్ధం చేసి, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని రెడ్కో మేనేజర్ రమణకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్ పాల్గొన్నారు.

Similar News

News March 24, 2026

సామాన్యుడి వంటింట్లో పశ్చిమాసియా చిచ్చు..!

image

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు సామాన్యుడి వంట గదిని గుల్ల చేస్తున్నాయి. జనవరి నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్న ధరలు, మార్చి నాటికి భగ్గుమన్నాయి. సరఫరా గొలుసు దెబ్బతినడంతో లీటర్ సన్‌ఫ్లవర్ నూనె 175కు చేరగా, పామాయిల్ 145 వద్ద రికార్డు స్థాయిని తాకింది. నెల రోజుల్లోనే సన్‌ఫ్లవర్ ఆయిల్ పై 21 పెరగడం గమనార్హం. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

News March 24, 2026

IPL: అత్యల్ప స్కోరు ఆర్సీబీదే!

image

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు(287) రికార్డు సన్ రైజర్స్ హైదరాబాద్ పేరిట <<19457522>>ఉంటే<<>>.. అత్యల్ప స్కోర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నమోదు చేసింది. 2017లో కోల్‌కతా(KKR)పై బెంగళూరు (RCB) చేసిన 49 రన్స్ నేటికీ లీగ్ చరిత్రలో అత్యల్పం. ఆ తర్వాత వరుసగా రాజస్థాన్ రాయల్స్ (58, 59), ఢిల్లీ (66, 67) పరుగులతో ఉన్నాయి. 2008లో ముంబై బౌలర్ల ధాటికి KKR కూడా 67 పరుగులకే కుప్పకూలింది.

News March 24, 2026

పశ్చిమాసియా సంక్షోభం.. కేంద్ర మంత్రుల కీలక భేటీ

image

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో పార్లమెంటు హౌస్‌లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కీలక భేటీ జరుగుతోంది. ఈ మీటింగ్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఎరువుల మంత్రి నడ్డా హాజరయ్యారు. మరోవైపు ఇదే అంశంపై రేపు ఆల్ పార్టీ మీటింగ్‌కు కేంద్రం <<19464829>>పిలుపునిచ్చిన<<>> విషయం తెలిసిందే.