News August 22, 2025

పల్నాడు కలెక్టర్‌తో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

image

పల్నాడు కలెక్టర్ అరుణ్ బాబు సహా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (GSDP), ఎంఐ ట్యాంకులు & గ్రౌండ్ వాటర్, జిల్లా జువెనైల్ జస్టిస్ కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

Similar News

News March 13, 2026

GMCలో అవినీతికి పాల్పడ్డ సెక్రటరీ సస్పెండ్

image

అవినీతికి పాల్పడిన గుంటూరు నగరపాలక సంస్థ సెక్రటరీ ఎ.పవన్ కుమార్ పై గురువారం సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేయాలని అధికారులను నగర కమిషనర్ కె. మయూర్ అశోక్‌ను కోరారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల సొమ్ము (ఆస్తి పన్ను, LRS) సొంతానికి వాడుకోవడం, తక్కువ మొత్తానికి నకిలీ రశీదులు సృష్టించి ప్రభుత్వం, ప్రజలను మోసం చేయడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

News March 13, 2026

సంగారెడ్డి జిల్లాకు రూ.2.10 కోట్లు ఎంపీ నిధులు

image

మెదక్ ఎంపీ రఘునందన్ రావు కృషితో సంగారెడ్డి జిల్లాకు భారీగా ఎంపీ నిధులు మంజూరయ్యాయని బీజేపీ నేత రాజేశ్వర్ రావు దేశ్ పాండే తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద వివిధ మండలాల్లోని 21 సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.2.10 కోట్లు అనుమతి లభించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

News March 13, 2026

చరిత్రలో ఈ రోజు (మార్చి 13)

image

1899: హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జననం (ఫొటోలో)
1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్ మరణం
1926: తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత వి.రామచంద్రరావు జననం
1940: జలియన్ వాలాబాగ్ కారకుడు మైఖేల్ డయ్యర్‌ను ఉద్దమ్ సింగ్ లండన్‌లో హతమార్చాడు