News August 22, 2025

సూర్యాపేట: ‘పహాణీలో పేరు మార్పుపై కేసు నమోదు’

image

గరిడేపల్లి మండలంలో పహాణీలో పట్టాదారు పేరు మార్చిన ఘటనపై సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై ఇది వరకే చర్యలు తీసుకోవాలని ఆదేశించడమే కాక, తప్పు చేసిన వారిపై పోలీస్ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు. తహశీల్దార్ కార్యాలయంలో ఎవరి ప్రమేయంతో ఈ తప్పు జరిగిందో విచారణ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు.

Similar News

News March 22, 2026

ADB: ఈ నెల 27 నుంచి కందుల కొనుగోలు బంద్

image

కేంద్ర ప్రభుత్వ సంస్థ (నాఫేడ్), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (మార్క్ ఫెడ్) కందుల కొనుగోలు చేయడానికి ఈ నెల 26 వరకు అవకాశం ఉందని మార్క్ ఫెడ్ మేనేజర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్‌లలో కందుల కొనుగోలు నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు 27 నుంచి తమ కందులను మార్కెట్ యార్డ్‌లకు తీసుకురావద్దని సూచించారు.

News March 22, 2026

హన్మకొండ: 11 మందిలో గెలిచింది ఒక్కడే!

image

తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ పోటీలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 11 మంది న్యాయవాదులు బరిలో నిలిచారు. ఇందులో సీనియర్ న్యాయవాది ఎం సహోదర రెడ్డి మాత్రమే విజయం సాధించారు. ఆదివారం విడుదలైన ఫలితాల్లో న్యాయవాది సహోదర్ రెడ్డి 1085 ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు. సహోదర్ రెడ్డి విజయంతో వరంగల్ కోర్టులో సంబరాలు నెలకొన్నాయి.

News March 22, 2026

ఈ గ్రామంలో వర్షమే కురవదు!

image

యెమెన్‌లోని అల్ హుతైబ్ గ్రామం ప్రపంచంలోనే అత్యంత వింతైన ప్రదేశం. సముద్ర మట్టానికి సుమారు 3,200 మీటర్ల ఎత్తున పర్వత శిఖరంపై ఉండటం వల్ల ఇక్కడ అసలు వర్షమే కురవదు. మేఘాలన్నీ ఈ గ్రామం కంటే తక్కువ ఎత్తులోనే ఏర్పడటం వల్ల వర్షం పడదు. అందుకే దీనిని ‘డ్రై సిటీ’ అని పిలుస్తారు. ఇక్కడ మేఘాలు చేతికి తాకే ఎత్తులోనే ఉండటం విశేషం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో