News August 22, 2025

తల్లిదండ్రులను పిల్లలు ఆదరించాలి: జడ్జి

image

ఇల్లందు: కనీ పెంచి విద్యా బుద్ధులు నేర్పించి ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులను మరవద్దని జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక గోవింద్ సెంటర్‌లోని పెన్షన్ భవన్‌లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. వృద్ధుల పట్ల చిన్నచూపు వద్దని, నిరాధారణకు గురైన వయోవృద్ధుల కోసం చట్టాలు ఉన్నాయన్నారు.

Similar News

News March 18, 2026

కామారెడ్డిలో ఎక్సైజ్ దాడులు.. అల్ఫాజోలం స్వాధీనం

image

కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ అధికారులు బుధవారం ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా ఆల్ఫాజోలం నిల్వ ఉంచిన వ్యక్తులను పట్టుకుని సుమారు 220 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆల్ఫాజోలం, రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి 110 గ్రాముల అల్పోజోలం , 106 గ్రాముల ఆల్ఫాజోలం స్వాగతం చేసుకున్నారు. మొత్తం 4 కేసులు నమోదు చేసి, నిందితులపై NDPS చట్టం కింద చర్యలు తీసుకున్నారు.

News March 18, 2026

జిల్లాలో షాదీ ఖానాల అభివృద్ధికి కృషి చేస్తా: ఎంపీ శివనాథ్

image

విజయవాడ పశ్చిమలో షాదీ ఖానాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ శివనాథ్ హామీ ఇచ్చారు. బుధవారం చిట్టినగర్‌లో ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పటికీ ఇఫ్తార్ విందుకు హాజరై ముస్లిం సోదరులతో గడపడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఏడు రంజాన్‌నాటికి ఎంపీ నిధులు కేటాయించి ఎన్టీఆర్ జిల్లాలో షాదీ ఖానాలు నిర్మిస్తామన్నారు.

News March 18, 2026

నిరంతర ఎల్పీజీ సరఫరాకు కలెక్టర్ ఆదేశాలు

image

రబీ 2025–26 ప్యాడీ కొనుగోలు ఏర్పాట్లపై DPC సమావేశం కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన జరిగింది. కొనుగోలు కేంద్రాలు, రవాణా, నిల్వ ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎల్పీజీ సరఫరా సమీక్షించి నిరంతర రీఫిల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనులకు విరుద్ధంగా వినియోగిస్తున్న 113 కేసుల్లో 160 సిలిండర్లు సీజ్ చేసినట్లు తెలిపారు.