News August 22, 2025
పేద విద్యార్థికి అండగా నిలిచిన యాదాద్రి కలెక్టర్

పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించాలనే సంకల్పంతో యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు నారాయణపురం మండలం శేరిగూడెం గ్రామానికి చెందిన భరత్ చంద్ర అనే విద్యార్థిని గత సంవత్సరం దత్తత
తీసుకున్నారు. ఈ సందర్భంగా భరత్ కుటుంబ పరిస్థితి చూసి చలించిన కలెక్టర్ ఆర్థికంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు గురువారం రూ.5 వేలు ఆర్థిక సాయంతోపాటు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరకులను ఈరోజు అందజేశారు.
Similar News
News March 20, 2026
ADB: ‘హాప్ వైఫ్’ సంస్కృతి మళ్లీ మొదలైందా..?

అమ్మాయిల <<19431469>>అక్రమ రవాణాలో<<>> ASF, ఉట్నూరు, ఖానాపూర్ ప్రాంతాలే టార్గెట్‌గా మారాయి. 2016లో తిర్యాణికి చెందిన ఓ 14 ఏళ్ల బాలికను తరలించే ప్రయత్నాన్ని మహారాష్ట్రలో పోలీసులు భగ్నం చేశారు. 2021లో కెరమెరిలో జరిగిన మరో ఘటనలో నిందితులు అరెస్టయ్యారు. కాగా గతంలో బయటపడిన బాధితులు ‘హాఫ్ వైఫ్’ సంస్కృతి పేరిట సామూహిక అత్యాచారాల బారిన పడ్డామని వెల్లడించారు. తాజాగా బెజ్జూర్ ఘటన వెలుగులోకి రాగా పోలీసులు అప్రమత్తమయ్యారు.
News March 20, 2026
WGL: 29న ప్రభుత్వ పాలిటెక్నిక్ 70 ఏళ్ల వేడుకలు

వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 29న ప్లాటినం జూబ్లీ వేడుకలను నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యే పూర్వ విద్యార్థులందరూ తమ పేర్లను ఈ నెల 22లోపు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. పాత విద్యార్థులందరూ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
News March 20, 2026
NGKL: అంతరించే దశలో అరుదైన కప్పలు

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అడవుల్లో ఒకప్పుడు సందడి చేసిన ‘కామన్ ట్రీ ఫ్రాగ్’ (చెట్టు కప్పల) సంఖ్య ఆందోళనకరంగా తగ్గుతోంది. పర్యావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషించే ఈ కప్పలు అటవీ నరికివేత, నీటి వనరుల కొరత, పురుగుమందుల మితిమీరిన వాడకం వల్ల అంతరించిపోతున్నాయని బయోలాజిస్ట్ రవికాంత్ తెలిపారు. ఈ అరుదైన కప్పలను కాపాడుకోవడానికి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నేడు అంతర్జాతీయ కప్పల దినోత్సవం.


