News August 22, 2025

పవన్ కళ్యాణ్ సూచన.. CBN అభినందనలు

image

AP: ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. నాలా చట్టసవరణపై చర్చిస్తుండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచన చేశారు. సాగుభూమిని వ్యవసాయేతరంగా మార్చేటప్పుడు లభించే ఆదాయం పంచాయతీలకు అందేలా చూడాలని, తద్వారా పంచాయతీలు బలోపేతం అవుతాయని చెప్పారు. దీనిపై స్పందించిన చంద్రబాబు మంచి సూచన చేశారని పవన్‌ను అభినందించారు. పవన్ సూచనలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News March 22, 2026

ఖాతాల్లోకి డబ్బులు.. 3 రోజులే ఛాన్స్

image

TG: రైతుభరోసా పథకం డబ్బులు పొందాలంటే మార్చి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 28 వరకు కొత్తగా పట్టాదారు పాస్ బుక్ పొందిన రైతులు, ఇప్పటివరకు రైతుభరోసా పొందని, బ్యాంక్ వివరాలు నమోదు చేయని వారు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. అప్లికేషన్ ఫామ్‌తో పాటు పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్, మొబైల్ నంబర్ వివరాలు సమర్పించాలి. పూర్తి వివరాలకు AEOలను సంప్రదించాలి.

News March 22, 2026

గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌‌లో పాక్ టాప్

image

ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్థాన్.. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో ఈసారి అగ్రస్థానంలో నిలిచింది. 2025లో ఉగ్రదాడులతో నమోదైన మరణాలు 6% పెరిగి 1,139కు చేరాయి. 2013 తర్వాత ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. పొరుగుదేశాలు.. ముఖ్యంగా అఫ్గాన్‌తో టెన్షన్స్.. TTP, BLA సంస్థల దాడులు ఇందుకు కారణాలని రిపోర్ట్ తెలిపింది. కాగా గత ఏడాది ఈ ఇండెక్స్‌లో బుర్కినో ఫాసో, పాక్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి.

News March 22, 2026

ఉస్తాద్ భగత్‌సింగ్ టికెట్ రేట్స్ తగ్గింపు

image

AP: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా టికెట్ ధరలు రాష్ట్రంలో రేపటి నుంచి తగ్గనున్నాయి. ఉగాదికి రిలీజైన ఈ మూవీకి 10రోజుల పాటు హైక్‌కు ప్రభుత్వం అనుమతించింది. అయితే TGతో సమానంగా ధరలను ఉంచేందుకు మేకర్స్ రేపటి నుంచే తగ్గించాలని డిసైడ్ అయ్యారు. టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్స్‌లో ₹100, మల్టీప్లెక్స్‌లలో ₹125 తగ్గనున్నాయి. దీంతో థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.