News August 22, 2025
అమలాపురం: జిల్లాను మొదటి స్థానంలో నిలపాలి: కలెక్టర్

ప్రభుత్వ పథకాల అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులకు పిలుపునిచ్చారు. అమరావతి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పథకాల అమలు తీరుపై చర్చించారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను చేరుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News March 20, 2026
ధాన్యం సేకరణ కోసం రూ.22,700 కోట్లు

TG: యాసంగిలో రైతుల నుంచి ధాన్యం సేకరణకు ప్రభుత్వం నిధులను సిద్ధం చేసింది. దీని కోసం రూ.22,700 కోట్లను పౌరసరఫరాల సంస్థ ఖాతాలో రుణం రూపేణా జమ చేయించింది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఈ రుణాన్ని ఇప్పించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రుణానికి గ్యారంటీ ఇస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో యాసంగిలో రైతుల నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా 95L MT ధాన్యాన్ని సేకరించనున్నారు.
News March 20, 2026
కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. నోటిఫై చేసిన కేంద్రం

FY 2026-27 APR 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్‌ను కేంద్రం నోటిఫై చేసింది. ఇందులో భాగంగా HYD, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్ నగరాలను మెట్రో జాబితాలో చేర్చి HRA మినహాయింపును 50%కి పెంచడం విశేషం. దీని ద్వారా రెంట్‌లో ఎక్కువ భాగాన్ని ట్యాక్స్ ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ట్రాన్స్‌పరెన్సీ పెంచేలా క్యాపిటల్ గెయిన్స్, NRI పన్ను నిబంధనలను కూడా ప్రభుత్వం కఠినతరం చేసింది.
News March 20, 2026
భద్రాద్రి శిఖరంపై అద్భుతం.. సుదర్శన చక్రం

భద్రాచల పుణ్యక్షేత్రంలో గర్భగుడి శిఖరంపై ఉన్న సుదర్శన చక్రం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. క్రీ.శ. 1675లో భక్త రామదాసు ఆలయ నిర్మాణ సమయంలో దీనిని ప్రతిష్ఠించారు. 350 ఏళ్లు గడిచినా నేటికీ ఈ దివ్య చక్రం చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఈ చక్రాన్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. రామ మహిమకు ఇది నిదర్శనమని భక్తులు కొనియాడుతున్నారు.


