News August 22, 2025
ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తు ఆహ్వానం: డీఈఓ

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు/ప్రధానోపాధ్యాయుల అంతర జిల్లా బదిలీలకు ప్రతిపాదనను సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అర్హత కలిగి, ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు లీప్ యాప్‌లో జిల్లా బదిలీల కోసం దరఖాస్తు ఈనెల 24 లోపు సమర్పించాలన్నారు. బదిలీలపై అర్హతలు, ఇతర వివరాలను https :/www.deoeluru.org వెబ్‌సైట్‌లో పొందాలన్నారు.
Similar News
News March 7, 2026
సింగరేణి సీఎండీని కలిసిన భద్రాద్రి కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కలెక్టర్ అంకిత్ శనివారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) సీఎండీ డా.జ్యోతి బుద్ధ ప్రకాష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, పరస్పర సహకారంపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు శిక్షణ కలెక్టర్ సౌరభ్ శర్మ కూడా పాల్గొన్నారు.
News March 7, 2026
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

* విజయవాడలో డ్రగ్స్ ముఠా అరెస్ట్
* కృష్ణ యూనివర్సిటీ డిగ్రీ 3,4 సెమిస్టర్ రీవాల్యూషన్ ఫలితాలు విడుదల
* ఉయ్యూరులో విద్యార్థుల మెడలో చెప్పుల దండ
* విజయవాడలో పోలీసులపై కాల్పులకు యత్నం.!
* కృష్ణాజిల్లాలో అంగన్వాడీ పోస్ట్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
* విజయవాడలో మూడు నెలలపాటు ఉచిత వెబ్ డెవలపర్ శిక్షణ
* మొవ్వ: బావిలో పడి మహిళా కూలి మృతి
News March 7, 2026
అబ్దుల్ అజీజ్ తల్లి మృతి.. మంత్రి సంతాపం

AP వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అజీజ్ మాతృమూర్తి అన్వర్ జాన్ మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ X వేదికగా స్పందించారు. అన్వర్ జాన్ మృతిపట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలనీ అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నట్లు పోస్ట్ చేశారు.


