News April 1, 2024

విశాఖ నుంచి తిరుపతికి అవయవాల తరలింపు

image

విశాఖలో ప్రత్యేక గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి అవయవాలను తిరుపతికి తరలించారు. జిల్లాలో మరణించిన వ్యక్తి గుండె, ఊపిరితిత్తులు తిరుపతిలో పద్మావతి చిల్డ్రన్స్‌ ఆస్పత్రిలో చిన్నారికి అమర్చాల్సి ఉంది. దీంతో షీలానగర్‌లో ఉన్న కిమ్స్‌లో సర్జరీ చేసి అవయవాలను ఆస్పత్రి నుంచి గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి 4 నిమిషాల్లో విశాఖ ఎయిర్‌పోర్టుకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి ఛార్డెర్డ్‌ ఫ్లైట్‌లో రేణిగుంటకు తరలించారు.

Similar News

News March 25, 2026

ఆంధ్రా యూనివర్సిటీలో ఘనంగా 91, 92వ స్నాతకోత్సవం

image

ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఆంధ్రా యూనివర్సిటీ 91, 92వ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. ఈ వేడుకలో 441 మందికి పీహెచ్‌డీలు, 174 మెడల్స్ ప్రదానం చేశారు. ముఖ్య అతిథులుగా పూర్ణచంద్రరావు సగ్గుర్తి, పతంజలి శాస్త్రి హాజరయ్యారు. కార్యక్రమంలో వీసీ రాజశేఖర్, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఉత్తమ పరిశోధనలు చేసిన పలువురు ఆచార్యులకు అవార్డులు అందజేశారు.

News March 25, 2026

విశాఖ: 28న జడ్పీ సర్వసభ్య సమావేశం

image

ఈనెల 28న స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఛైర్‌పర్సన్ అధ్యక్షతన ఉదయం10:30 గంటలకు ఈ భేటీ ప్రారంభమవుతుందని జడ్పీ సీఈవో పి. నారాయణమూర్తి తెలిపారు. జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు పూర్తి నివేదికలతో హాజరుకావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.