News August 22, 2025
పెద్దపల్లి: ‘భూ సమస్యలకు కలెక్టరేట్‌కు రావాల్సిన పనిలేదు’

పెద్దపల్లి జిల్లాలో భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం లేదని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. మార్కెట్ విలువ రూ. 5 లక్షలలోపు ఉన్న మిస్సింగ్ సర్వే నంబర్లు, భూ విస్తీర్ణ సవరణ, పట్టా పాస్‌బుక్ డిజిటల్ సైన్, నాలా వంటి అంశాలు నేరుగా ఆర్డీఓ కార్యాలయంలోనే పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు.
Similar News
News March 14, 2026
ఎన్టీఆర్ జిల్లాను రోడ్డు భద్రతలో నెం.1గా నిలపాలి: కలెక్టర్

రహదారి ప్రమాదాలను తగ్గించి, ఎన్టీఆర్ జిల్లాను రోడ్డు భద్రతలో అగ్రస్థానంలో నిలబెట్టాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, బ్లాక్ స్పాట్ల వద్ద పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా యంత్రాంగం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
News March 14, 2026
వనపర్తిలో టెన్త్ పరీక్షలకు 7,212 మంది విద్యార్థులు

వనపర్తి జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా 37 కేంద్రాల్లో (25 ప్రభుత్వ, 12 ప్రైవేట్) మొత్తం 7,212 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నిర్ణీత సమయానికి అరగంట ముందే చేరుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 5 నిమిషాల ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
News March 14, 2026
విశాఖలో మరో IT పార్క్.. 30వేల జాబ్స్!

AP: విశాఖ మధురవాడ(రుషికొండ) ఐటీ హిల్స్‌లో గ్రేడ్-1 ఐటీ పార్క్ రానుంది. విశాఖ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు హిల్-3 వెనుక ప్రభుత్వం 30 ఎకరాలు కేటాయించింది. ఈ కంపెనీ 3 దశల్లో రూ.2,200కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా, దాదాపు 30,000 మందికి ఉద్యోగావకాశాలు రానున్నట్లు సమాచారం. 30లక్షల చ.అ విస్తీర్ణంలో భవనాలు నిర్మించనున్నారు. ఇక అమరావతిలో రూ.300కోట్ల పెట్టుబడితో ‘జేవియర్’ క్యాంపస్ ఏర్పాటు కానుంది.


